ప్రపంచ క్రికెట్లో రిచేస్ట్ క్రికెట్ లీగ్ గా పేరు సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కు సంబంధించి ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఇక ఈ ఐపీఎల్ కు సంబంధించి మినీ వేలం ప్రక్రియ కూడా జరగబోతుంది. దుబాయ్ వేదికగా ఈ మెగా ఆక్షన్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వేలంలో ఏ ఆటగాడిని ఏ టీం కొనుగోలు చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.


 ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా అటు మినీ వేలంలో పాల్గొంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే కొంతమంది ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే అటు రిటెన్షన్ ప్రక్రియ కూడా పూర్తయింది అని చెప్పాలి. ఆయా టీమ్స్ అన్ని కూడా తమ జట్టుతో అంటిపెట్టుకునే ఆటగాళ్లతో పాటు ఇక జట్టు నుంచి విడుదల చేసే ఆటగాళ్ల వివరాలను కూడా ఇప్పటికే సమర్పించాయి. ఈ క్రమంలోనే కొన్ని టీమ్స్ ఏకంగా జట్టులో స్టార్ ప్లేయర్లుగా పవర్ హిట్టర్లుగా కొనసాగుతున్న వాళ్లని వదులుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది.


 సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఇదే చేసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన పవర్ హిట్టర్ హ్యారి బ్రూక్ ను వదిలేసింది. ఈ విషయంపై అందరూ షాక్ అయ్యారు. సన్రైజర్స్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఆ జట్టు మాజీ కోచ్ టామ్ మూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  హ్యారి బ్రూక్ ను వదిలేయడం పట్ల సన్రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా చింతిస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు. బ్రూక్ సత్తా కలిగిన ఆటగాడు. వదిలేయడం సరికాదు అంటూ చెప్పుకొచ్చాడు. అతన్ని మిడిల్ ఆర్డర్ కోసం సన్రైజర్స్ కొనుగోలు చేసింది. కానీ వివిధ స్థానాలలో ఆడిస్తూ ప్రయోగాలు చేసింది. అందుకే అతను సరిగా ఆడలేదు. ఇక ఇప్పుడు వేలంలో అతని కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీ పడతాయి అంటూ టామ్ మూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl