భారత జట్టులో మాజీ కెప్టెన్ గా స్టార్ ప్రేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి అటు ప్రపంచ క్రికెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న అటు విరాట్ కోహ్లీకి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే అతని ఆటతీరుతో ఇక ఈ తరానికి అతన్ని మించిన లెజెండ్  మరొకరు లేరు అన్న విషయాన్ని ఇప్పటికే విరాట్ కోహ్లీ నిరూపించాడు. అయితే ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి ఇక తన పేరుతో లికించుకున్నాడు అని చెప్పాలి.


 ఇలా ప్రస్తుతం క్రికెట్లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులకు స్టార్ ప్లేయర్ కూడా దరిదాపుల్లో కూడా లేరు. అయితే కేవలం క్రికెట్లో మాత్రమే కాదు అన్ని విషయాల్లో కూడా విరాట్ కోహ్లీ తనకు తిరుగులేదు అని నిరూపించుకున్నాడు. ఏ స్టార్ క్రికెటర్ కి సాధ్యం కాని రీతిలో ఏకంగా సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఇక వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా అందరూ స్టార్ క్రికెటర్లను వెనక్కి నుండి  నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో, క్రికెట్లో మాత్రమే కాదు ఇక ఇప్పుడు వికీపీడియా లోను విరాట్ కోహ్లీ కింగ్ అనే విషయం మరోసారి రుజువైంది.


 గతంలో పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో ఫాలోవర్స్ ను సంపాదించడం విషయంలో రికార్డులు కొల్లగొట్టిన కోహ్లీ ఇక ఇప్పుడు వికీపీడియాలోను అరుదైన రికార్డు నెలకొల్పాడు. గత అక్టోబర్లో ఎక్కువమంది వెతికిన, చూసిన వికీపీడియా పేజీగా విరాట్ కోహ్లీ పేజీ నిలిచింది. వరల్డ్ కప్ 2023 సందర్భంగా ఆయన పేజీని అత్యధిక మంది సెర్చ్ చేశారు  ఐదు మిలియన్ల మంది కోహ్లీ పేజీని వీక్షించారూ. ఇక తర్వాత స్థానంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వికీపీడియా పేజీని 4.7 మిలియన్ మంది చెక్ చేశారు. దీంతో ఇక వికీపీడియాలో కూడా విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: