గత కొన్ని రోజుల నుంచి భారత క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఒక్కరే. అతనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎన్నో ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఒక రకంగా చెప్పాలంటే అతను స్టార్ ప్లేయర్గా ఎదిగింది కూడా ముంబై ఇండియన్స్ జట్టులోనే అని చెప్పాలి. అయితే 2022 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ అతని వేలంలోకి వదిలేయడంతో ఇక గుజరాత్ అతని దక్కించుకుంది.


 అయితే ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జట్టును తన కెప్టెన్సీ తో మొదటి ప్రయత్నంలోనే ఛాంపియన్గా నిలిపాడు. ఇక రెండో ప్రయత్నంలో ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయిన గుజరాత్ రెండో సీజన్లో రన్నరప్ గా నిలిచింది. అయితే మూడో సీజన్ లో కూడా హార్దిక్ గుజరాత్ ను టైటిల్ విన్నర్ గా నిలుపుతాడని అభిమానులు అందరూ అనుకుంటున్న వేళ.. అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా తన పాత టీం అయినా ముంబైలోకి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఇదే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ని వాడుకొని వదిలేసాడు అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


 అయితే ఇలా హార్థిక్ పాండ్యా ఏకంగా తననే నమ్ముకున్న గుజరాత్ ను వదిలేసి ముంబైలోకి వెళ్లిపోవడంతో గతంలో విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. నన్ను వేలంలోకి రావాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరాయి. ఒక టైంలో ఆర్సిబి ని వదిలేద్దామని అనుకున్నాను. అయితే మనం ఉన్నా లేకపోయినా రోజులు గడిచిపోతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇంతకాలం అని రాసి ఉంటుంది. ట్రోఫీలు గెలవకపోయినా ఏ ఫ్రాంచైజీ ప్లేయర్కు ఇంతలా మద్దతుగా నిలవదు. ఆర్సిబి ప్లేయర్స్ పట్ల చూపించిన విశ్వాసం అద్భుతం.  ఏ టీమ్ లోను ఇంత మద్దతు లభిస్తుందని అనిపించలేదు అంటూ కోహ్లీ కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: