టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించిన సమయంలోనే కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అదే క్రేజ్ తో కొనసాగుతూ ఉన్నాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం బెస్ట్ కెప్టెన్ గా మాత్రమే కాదు బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషర్ గా కూడా మహేంద్రసింగ్ ధోనీకి పేరు ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ధోని అటు ఐపీఎల్ లో మాత్రం తన ఆటతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.


 అయితే గత రెండు మూడు ఐపిఎల్ సీజన్స్ నుంచి కూడా ధోని రిటైర్ అవ్వబోతున్నాడు అన్న వార్తలు అభిమానులు అందరిని కూడా ఆందోళనకు గురి చేశాయి అని చెప్పాలి.ఏకంగా ధోని ఐపిఎల్ కెరీర్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అంటూ   వార్తలు ఎన్ని వచ్చినా అటు ధోని మాత్రం ప్రతి ఐపీఎల్ సీజన్లో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ సీజన్ కోసం కూడా ధోని జట్టులో ఉంటాడు అన్న విషయం ఇటీవల జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ విషయంపై అభిమానులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇదే విషయంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబి డివిలియర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఐపిఎల్ జైత్రయాత్ర అంచనాలను మించి సాగుతోంది అంటూ ప్రశంసించాడు. ఈ సీజన్లో చెన్నై కొనసాగించిన ఆటగాళ్ల జాబితాలో మహేంద్రసింగ్ ధోని పేరు చూసి ఎంతో సంతోషపడ్డాను. ఆయన ఇక ఐపీఎల్ ఆడరు అని భారీగా ప్రచారం జరిగింది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ మళ్ళీ ఐపీఎల్లో ప్రేక్షకులను అలరించేందుకు మహీ సిద్ధమయ్యాడు. ఇప్పుడే కాదు ధోని ఎప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. మరో మూడు సీజన్ ల వరకు ఆడతాడేమో అంటూ ఏబి డివిలియర్స్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: