ఇటీవల కాలంలో భారత క్రికెట్లో యువ ఆటగాళ్ల హవా ఎంతల పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత జట్టులో చోటు సంపాదించుకుంటున్న ఎంతో మంది యంగ్ ప్లేయర్ వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ తమ స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక భారత క్రికెట్కు తామే ఫ్యూచర్ స్టార్స్ అనే విషయాన్ని కూడా తమ ఆట తీరుతో అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు. ఇక ఎన్నో అరుదైన రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటూ ఉన్నారు.


 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతున్న భారత జట్టులో చోటు సంపాదించుకున్న యంగ్ ప్లేయర్స్ సైతం ఇలాగే తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు అని చెప్పాలి. ఏకంగా సీనియర్లు అందరూ కూడా జట్టులో ఉన్నప్పుడు సైతం సాధ్యం కాని రీతిలో.. యంగ్ ప్లేయర్స్ బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించి భారీగా పరుగులు చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇక ఇలా భారీగా పరుగులు చేస్తూ రికార్డులు కొలగొట్టడమే లక్ష్యంగా జట్టును విజయ తీరాలకు చేర్చడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు అని చెప్పాలి. ఇక ఆస్ట్రేలియతో జరుగుతున్న టి20 సిరీస్ లో నాలుగు మ్యాచ్లు ముగియగా.. మూడు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంది.



 అయితే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో విజయం టీమిండియానే వరించింది. అయితే నాలుగో టి20 మ్యాచ్ లో భారత ఓపెనర్ రుతురాజ్  చరిత్ర సృష్టించాడు. ఏకంగా ఈ మ్యాచ్ లో 32 పరుగులు చేశాడు. దీంతో టి20 ఫార్మాట్లలో భారత్ తరపున అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్గా నిలిచాడు. 116 ఇన్నింగ్స్ లోనే రుతురాజ్ ఈ ఘనత అందుకోవడం గమనార్హం. ఇక అతని తర్వాత కేఎల్ రాహుల్ 117 ఇన్నింగ్స్ తో ఉన్నాడు. ఇక మొత్తంగా చూసుకుంటే 107 ఇన్నింగ్స్ లతో ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా క్రిస్ గేల్ టాప్ లో ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: