ప్రస్తుతం ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య ఇండియా వేదికగా టి20 సిరీస్ జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈ టి20 సిరీస్ లో భాగంగా నాలుగు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో మూడింటిలో టీమిండియా విజయం సాధిస్తే.. ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు విజయం అందుకుంది. అయితే మూడు ఒకటి తేడాతో పాటు భారత జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి.అయితే ఇక ఈ సిరీస్ లో భాగంగా ఇటీవల నాలుగో మ్యాచ చత్తీస్గడ్  లోని రాయపూర్ స్టేడియం వేదికగా జరిగింది అని చెప్పాలి.


అయితే ఇక నాలుగో టి20 మ్యాచ్ ప్రారంభం కాకముందు నుంచే రాయపూర్ స్టేడియం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొట్టింది. కొన్నెళ్ల నుంచి ఆ స్టేడియం కరెంట్ బిల్లును కట్టలేదని.. ఏకంగా కోట్ల రూపాయల కరెంటు బిల్లు పెండింగ్లో ఉందని దీంతో విద్యుత్ అధికారులు కూడా ఆ స్టేడియం కు విద్యుత్ నిలిపివేశారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇలా విద్యుత్ నిలిపివేస్తే ఇక ఇప్పుడు మ్యాచ్ ఎలా జరుగుతుందో అని అందరూ ఆందోళన చెందారు. అయితే ఇక జనరేటర్ల సహాయంతో మ్యాచ్ ను సమర్థవంతంగానే నిర్వహించారు. కానీ ఈ మ్యాచ్ నిర్వహణకు మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.


 ఏకంగా జనరేటర్లతో మ్యాచ్ నడిపినందుకు..  స్టేడియం విద్యుత్ కోసం 1.4 కోట్ల రూపాయలు వరకు ఖర్చు అయిందట. కాగా 3.1 కోట్ల కరెంట్ బిల్లు బాకీ ఉండడంతో ఐదేళ్ల క్రితమే విద్యుత్ అధికారులు ఈ స్టేడియానికి అటు కరెంట్ కట్ చేశారు. దీంతో ఇంత మొత్తం బిల్లు చెల్లించలేని స్టేడియం నిర్వాహకులు చివరికి జనరేటర్ల సహాయంతో మ్యాచ్ నిర్వహించారు. అయినప్పటికీ ఇక ఈ పని కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన భారత జట్టు.. సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: