దయ్యాలు ఉన్నాయా లేవా.. ఈ ప్రశ్న ఎవరినైనా అడిగారు అంటే ఉన్నాయి అని చెప్పలేరు. అలా అని లేవు అని కచ్చితంగా చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఉన్నాయని కొన్నిసార్లు అనుకుంటే.. లేవు అని మరికొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది దయ్యాలు లేవు ఏమీ లేవు అని పైకి ధైర్యంగా కనిపించిన.. ఇక అప్పుడప్పుడు ఎక్కడైనా క్షుద్ర పూజలు చేసినట్లు కనిపించింది అంటే చాలు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అందుకే రాత్రి అయిందంటే చాలు ఎక్కడైనా దయాలు ఉన్నాయి అని తెలిస్తే.. ఆ ప్రాంతంలోకి వెళ్లడానికి అందరూ వెనకడుగు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా దయ్యాలకు ఆహారం పెట్టే  పండగ చేస్తారట. దయ్యాలకు ఆహారం పెట్టే పండుగ ఏంటి గురు.. వినడానికి విచిత్రంగా కాస్త భయానకంగా కూడా ఉంది అనుకుంటున్నారు కదా. ఆసియా దేశమైన కంబోడియాలో షరత్దృతువులో ది ఫ్రమ్ బెన్ ఫెస్టివల్ చేస్తారు. ఈ సమయంలో ఐదు రోజుల పాటు నరకం ద్వారాలు తెరవబడి ఆకలితో ఆత్మలు, దయ్యాలు బయటకు వస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. దీంతో ఆ సమయంలో దయ్యాలకు ఆహారం ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను దయ్యాలు ఇబ్బంది పెడతాయని ప్రాగాడంగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే అక్టోబర్లో 15 రోజులపాటు దయ్యాలకు ఆహారం పెట్టే ఉత్సవం నిర్వహించుకుంటారు. ఇలా ఆహారం పెట్టడం వల్ల ఆకలితో ఉన్న దయ్యాలు శాంతిస్తాయని నమ్ముతూ ఉంటారు అక్కడ జనాలు. ఈ క్రమంలోనే అన్ని కుటుంబాలు కూడా రకరకాల వంటకాలు చేస్తారట. ఈ క్రమంలోనే ప్రతి కుటుంబం నుంచి తమ చివరి ఏడుగురు పూర్వీకులకు ఆహారం అందిస్తారట. ఏకంగా సూర్యకాంతి పడకుండా చీకట్లోనే లేచి ఆహారాన్ని సిద్ధం చేసి దయ్యాలకు ఇస్తారట. అయితే ఈ పండుగ తొమ్మిదవ శతాబ్దం నాటి నుంచి కొనసాగుతూ వస్తుందట. ఇక అక్టోబర్ నెలలో ప్రతి కుటుంబం కూడా తూచా తప్పకుండా ఈ పండుగను నిర్వహించుకుంటూ ఉంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: