తాను కూడా ప్రజల మనిషివే అని నమ్మించడానికి తెగ ఆరాటపడుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే డబ్బు మధ్యానికి పని చెబుతూ ఓటర్లను మభ్య పెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎన్నికల కోడ్ విడుదలైన నాటి నుంచి కూడా ఊరువాడ అనే తేడా లేకుండా ప్రతి చోట ప్రచార హోరుని కొనసాగిస్తూ ఉంటారు. కేవలం అభ్యర్థులు మాత్రమే కాదు తమ పార్టీలో ఉన్న పైస్థాయి నాయకులను సైతం పిలిపించి ఇక భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇలా ప్రచారాల కోసం ఎన్నికల కమిషన్ చెప్పిన లక్షల రూపాయలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.
కానీ నేటి రోజుల్లో ఇలా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా గెలవడం సాధ్యమవుతుందా అలా ఎలా సాధ్యమవుతుంది అంటారు ఓటర్లు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఎన్నికల ప్రచారం చేయకుండానే గెలిచాడు. ఏదో అదృష్టం కలిసి వచ్చి గెలిచి ఉంటాడులే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతనూ గెలిచింది ఒక్కసారి కాదు. ఏకంగా తొమ్మిది సార్లు. ఎన్నికల ప్రచారంలో ఎంతోమంది జోరు చూపిస్తే కొందరు మాత్రమే గెలుస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్లో బిజెపి నేత గోపాల్ భార్గవ్ మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది సార్లు గెలిచారు. 1985 నుంచి రహ్లీ నియోజకవర్గంలో ఉన్న ఆయన తన పట్టును నిలుపుకుంటూ వస్తున్నారు. నేను ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటా. అందుకే ఎన్నికల సమయంలో ప్రచారం చేయను అంటూ చెబుతున్నారు గోపాల్ భార్గవ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి