భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ క్రికెట్ దేవుడిగా కొనసాగుతూ ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో సేవలు అందించిన సచిన్ టెండూల్కర్.. తన అద్వితీయమైన ఆటతీరుతో కోట్ల మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అని చెప్పాలి. ఇక ఎంతో మంది స్టార్ క్రికెటర్లు వచ్చిన సచిన్ కు భారత క్రికెట్ ప్రేక్షకుల మధిలో ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ తగ్గదు అనడంలో సందేహం లేదు. అయితే ఇక నిన్నటి తరంలో సచిన్ టెండూల్కర్ లెజెండ్ గా అవతరిస్తే నేటి తరానికి విరాట్ కోహ్లీ దిగ్గజ ఆటగాడిగా మారిపోయాడు అని చెప్పాలి.


 సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నాడు కోహ్లీ. నిన్నటి తరంలో సచిన్ టెండూల్కర్ ఎలా అయితే మిగతా స్టార్ ఆటగాళ్లకు అందనంత ఎత్తులో ప్రస్థానాన్ని కొనసాగించాడో.. ఇప్పుడు కోహ్లీ సైతం అదే రీతిలో కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఇద్దరు టీమ్ ఇండియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే లెజెండ్స్ అనడంలో సందేహం లేదు  అయితే ఈ ఇద్దరూ లెజెండ్స్ కి ఇటీవల ఒక అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా ఆయోధ్యలోని రామాలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఇతర క్రికెటర్లకు ఆహ్వానం అందింది.


 రామ జన్మభూమిగా పిలుచుకునే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణం చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు ఈ విషయంపై కోర్టులో విచారణ జరగగా.. ఇక హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రామాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టింది. కాగా ఈ ఆలయంలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మరికొన్ని రోజుల్లో జరగబోతుంది. ఈ క్రమంలోనే ఈ మహత్తరమైన కార్యానికి దేశవ్యాప్తంగా పలువురు సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల్ని ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ లెజెండ్స్ గా కొనసాగుతున్న సచిన్ కోహ్లీ లకు ఆహ్వానం అందినట్లు సమాచారం. వచ్చేనెల 22వ తేదీన ఈ కార్యక్రమం జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: