టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ ల విధ్వంసానికి  మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫార్మాట్లో క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు. ఏకంగా స్కోరు బోర్డుకు సైతం ఆయాసం వచ్చే విధంగా తన ఆట తీరుతో అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి బ్యాటింగ్ మెరుపులు ఉంటాయి కాబట్టి క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా టి20 ఫార్మాట్ ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే టి20 ఫార్మాట్లో దాదాపుగా జట్టులో ఉన్న అందరూ బ్యాట్స్మెన్లు కూడా చెలరేగిపోయి భారీగా పరుగులు చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఒక టీం చేసిన పరుగులను మిగతా టీం లోని పదిమంది ప్లేయర్స్ కూడా తమ బ్యాటింగ్తో చేదిస్తూ ఉంటారు. కానీ ఏకంగా ఒక జట్టులోని 10 మంది ఆటగాళ్లు చేసిన స్కోర్ ని మరో జట్టులోని ఒకే ఒక ప్లేయర్ బాదితే అది నిజంగా సంచలమే అవుతుంది. అబుదాబి టి10 లీగ్ 2023లో ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. ఇటీవల టీం అబుదాబి, బంగ్లా టైగర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా ఒక బ్యాటర్ ప్రత్యర్థి టీం లోని పదిమంది చేసిన స్కోర్ ల కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో తోలుత బ్యాటింగ్ చేసిన అబూదాభి టీం నిర్ణీత  పది ఓవర్లలో 65 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే బంగ్లా టైగర్స్ బ్యాటర్ ఇంగ్లాండ్ యువ ఆటగాడు జోర్ధన్ కాక్స్ ఒక్కడే ఏకంగా 65 పరుగులు చేసాడు. 23 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. జోర్దాన్ చెలరేగిపోవడంతో బంగ్లా టైగర్స్ 4.5 ఓవర్లలోని వికెట్ మాత్రమే కోల్పోయి విజయ తీరాలకు చేరింది అని చెప్పాలి. కాగా అబుదాబి ఇన్నింగ్స్ లో ఇద్దరు డక్ ఔట్లు కాగా..  ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యారు. ఇక జట్టు కెప్టెన్ ప్రిటోరియస్ 15 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక చివర్లో వచ్చిన రయిస్ 8 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: