సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు ఏదో ఒక మ్యాచ్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఎన్ని టీమ్స్ మధ్య మ్యాచ్ జరిగిన ఉండని ఉత్కంఠ మాత్రం పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుందంటే.. చాలు ఉత్కంఠ రెట్టింపు అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా టీమ్స్ ని అంతర్జాతీయ క్రికెట్ లో దాయాది టీమ్స్ గా పిలుచుకుంటూ ఉంటారు. అయితే అన్ని జట్ల లాగా ఈ రెండు టీమ్స్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగవు. ఇక ఎప్పుడైనా మ్యాచ్ జరిగింది అంటే అది ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో మినహా సాదాసీదా మ్యాచ్ లు మాత్రం ఈ రెండు టీమ్స్ మధ్య చూడటం దాదాపు అసాధ్యం.


 దీనికి అంతటికి కారణం భారత ప్రభుత్వం పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్లపై నిషేధం విధించడమే అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ రెండు టీమ్స్ ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో తలబడుతూ ఉండడంతో ఇక ఆ మ్యాచ్ ను చూసేందుకు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ వచ్చిన కూడా ఉత్కంఠ  రెట్టింపు  అవుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో ఇలాంటి దాయాదుల సమయాన్ని చూసి ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే ఇక ఇప్పుడు ఈనెల 10వ తేదీన మరోసారి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుందట.


 అండర్ 19 పురుషుల ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే తొలి మ్యాచ్లోనే భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ నెల 10వ తేదీన దయాధుల సమరం ఉండబోతుంది అని చెప్పాలి. భారత్ పాకిస్తాన్ జట్లు మరోసారి తలబడబోతున్నాయి. అయితే దుబాయిలో ఈ ఆసియా కప్ టోర్ని నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో మొత్తంగా 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్ తో పాటు జపాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యూఏఈ టీమ్స్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: