ఇక పాకిస్తాన్ జట్టు ఫీల్డింగు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు ఫీల్డింగ్ లో ఎంతో ఈజీగా పట్టాల్సిన క్యాచ్ లోను వదిలేసి ఇక నవ్వుల పాలు అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక ఇటీవలే పాకిస్తాన్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిపోయింది. సాధారణంగా ఏ క్రికెట్ టీం లో అయినా సరే ఆటగాళ్లు హాఫ్ సెంచరీ చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇటీవల పాకిస్తాన్ జట్టు కూడా హాఫ్ సెంచరీ చేసింది. ఇక ఈ టీంలోని ఆటగాళ్లు ఎవరో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశారు అనుకుంటే పొరపాటు. ఏకంగా ఎక్స్ ట్రా రన్స్ ఇవ్వడంలో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకుంది పాకిస్తాన్ జట్టు. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది కదా. కానీ ఇటీవల ఇలాంటి ఘటన నిజంగానే జరిగింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా అద్భుతంగా రాణిస్తుంటే అటు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లకు బంతులు వేయడానికి పాకిస్తాన్ బౌలర్లు మాత్రం వనికి పోతున్నారు. దీంతో ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు ఎక్స్ ట్రా రన్స్ ఇవ్వడంలో పోటీ పడుతున్నారు అని చెప్పాలి. ఏకంగా ఆస్ట్రేలియా 318 పరుగులు చేయగా.. ఇందులో 52 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలోనే ఉండడం గమనార్హం. 20 బైస్, 15 లెగ్ బైస్, 15 వైడ్లు, రెండు నోబాల్స్ ఇందులో ఉన్నాయి అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా ఎక్స్ ట్రాలు ఇచ్చిన రికార్డు పాకిస్తాన్ పేరిటే ఉంది. 2007లో భారత్తో జరిగిన టెస్టులో ఆ జట్టు ఏకంగా 76 ఎక్స్ ట్రా రన్స్ ఇవ్వడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి