ఇటీవల కాలంలో టి20 ఫార్మాట్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది అన్న విషయాన్ని తెలిసిందే. దీంతో ఆటగాళ్ల ఆలోచన తీరులో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఇక జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో ఛాన్సులు దక్కించుకోవాలని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏకంగా అతి తక్కువ వయసులోనే మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టి20 ఫార్మాట్లో కొనసాగడానికి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. తద్వారా ఇక టి20 మ్యాచ్ లు లేని సమయంలో దొరికిన సమయాన్ని వివిధ దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహిస్తున్న టి20 టోర్నీలలో ఆడుతూ క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే రోజురోజుకీ అటు టెస్ట్ ఫార్మాట్ తో పాటు వన్డే ఫార్మాట్ భవితవ్యం కూడా ప్రమాదంలో పడిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనె ఈ రెండు ఫార్మట్లను కాపాడుకోవాలంటే క్రికెట్ బోర్డులు కఠిన రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అని ఎంతో మంది మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు. అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు ఫార్మాట్లు మాత్రమే కాదు డొమెస్టిక్ క్రికెట్ ని కూడా ప్లేయర్లు పక్కన పెట్టేస్తూ ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులు అటు భారత క్రికెట్లో కూడా నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ ఈ విషయంలో కఠినమైన రూల్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.


 ప్రతి ఒక ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్లో కూడా తప్పక ఆడాల్సిందే అనే నిబంధనను తెరమీదకి తీసుకువచ్చింది బీసీసీఐ. ఇటీవల ఇలాంటి రూల్స్ తోనే సెంట్రల్ కాంట్రాక్టు ప్రకటించింది అన్న విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలను మాజీ కోచ్ రవి శాస్త్రి అభినందించారు. ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్టులతో ఆటను మార్చే ఎత్తుగడను ఎంచుకున్న బీసీసీఐ, జై షాను అభినందించారు రవి శాస్త్రి. ఈ ఏడాది జరిగే కీలక సిరీస్ ల కోసం టీంను సిద్ధం చేయడంలో ఇది ఒక కీలక దశ. టెస్ట్ డొమెస్టిక్ క్రికెట్కు ప్రాధాన్యమిస్తూ శక్తివంతమైన సందేశం ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: