ఐపీఎల్ 17వ సీజన్లో యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ను అనుకోని అదృష్టం వరించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ టీంగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మహేంద్ర సింగ్ ధోని తర్వాత కెప్టెన్సీ వహించే అవకాశాన్ని దక్కించుకున్నాడు రుతురాజ్ . అయితే ధోని తర్వాత చెన్నైని సారధిగా నడిపిస్తున్న రుతురాజ్.. ఎలా జట్టును హ్యాండిల్ చేయగలడు అనే విషయంపై అందరిలో అనుమానాలు ఉండేవి.


 కానీ ఇప్పుడు ఋతురాజ్ తన కెప్టెన్సీ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. అయితే సాధారణంగా ఇలా జట్టుకు కెప్టెన్సీ వహించిన సమయంలో కొంతమంది యువ ఆటగాళ్లు ఒత్తిడితో ఇక ఫామ్ కోల్పోవడం చూస్తూ ఉంటాం. ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయంలో నిరాశ పరుస్తూ ఉంటారు. కానీ రుతురాజ్ కైక్వాడ్ మాత్రం ఒకవైపు కెప్టెన్సీ తో అదరగొడుతూనే.. ఇంకోవైపు వ్యక్తిగత ప్రదర్శనలో కూడా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్లో కూడా అదిరిపోయే బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇటీవల  ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రుతురాజ్ విధ్వంసం సృష్టించాడు.


 సహచర బ్యాట్ మెన్స్ అందరూ కూడా వరుసగా వికెట్లు కోల్పోతున్న సమయంలో.. అతను మాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. ఏకంగా 40 పంతుల్లోనే 69 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డు కూడా సృష్టించాడు  ఐపీఎల్ లో అత్యంత వేగంగా 2000 పరుగులు  పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు. 57 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన రుతురాజ్.. గతంలో 60 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డుని బ్రేక్ చేశాడు అని చెప్పాలి. ఓవరాల్ గా చూసుకుంటే కేవలం 40 ఇన్నింగ్స్ లోనే 2000 పరుగుల మార్కు అందుకుని క్రిస్ గేల్ అందరికంటే ముందున్నాడు. ఇక ఈ లిస్టులో అటు రుతురాజ్ మూడో స్థానంలో ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: