ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లోనే మోస్ట్ అన్ లక్కీ జట్టుగా పేరు సంపాదించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి ఇక ఈ సీజన్లో మరింత దయనీయంగా మారిపోయింది అని చెప్పాలి  ప్రతి సీజన్లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే ఆర్సిబి జట్టు ఇక కాస్త కూస్తో మంచి ప్రదర్శన చేసి అభిమానులను సంతృప్తి పరుస్తూ ఉంటుంది. టైటిల్ గెలవ లేకపోతేనేం.. మా జట్టు వీరోచితమైన పోరాటం చేసింది అంటూ గర్వంగా కాలర్ ఎగరేసుకొని మరి చెప్పుకునే వారు ఆ జట్టు అభిమానులు. కానీ ఇప్పుడు ఆ అదృష్టం కూడా అభిమానులకు లేకుండా పోయింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో లాగానే ఐపిఎల్ లో కూడా మెన్స్ ఆర్ సి బి టీం టైటిల్ గెలుస్తుందని బలంగా నమ్మకాన్ని పెట్టుకున్నారు అభిమానులు.


 కానీ జట్టు అభిమానుల నమ్మకాన్ని ఎక్కడ నిలబెట్ట లేక పోయింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక దాదాపు ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే అని చెప్పాలి. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆర్సిబి టీం కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. బ్యాటింగ్లో బౌలింగ్లో ఆ జట్టు పూర్తిగా విఫలమౌతుంది అని చెప్పాలి. కొన్ని మ్యాచ్లలో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ అటు జట్టుకు అదృష్టం కలిసి రాక చివరికి ఓటమి తప్పడం లేదు. దీంతో ఆర్సిబి జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు జట్టు విజయాల్లో కీలక పాత్ర వహించిన ఆటగాళ్లను వదులుకొని ఇప్పుడు ఆర్సిబి బాధపడుతుంది అంటూ కొంతమంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయం గురించి భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉత్తప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తిరిగి మా జట్టులోకి రావాలి అంటూ స్టార్ స్పిన్నర్ చాహాల్ ను బతిమిలాడుకోండి అంటూ ఆర్సిబికి సూచించాడు రాబిన్ ఉత్తప్ప. చాహాల్ తో పాటు హర్షల్ పటేల్ ను కూడా వెనక్కి రావాలని కోరండి. శివం దూబే, పడిక్కల్, మయాంక్ అగర్వాల్ లాంటి ఆటగాల్లను కూడా జట్టులోకి తీసుకోండి. జట్టులో స్టార్ ప్లేయర్స్ ఉన్న వరుస ఓటములు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు జట్టులో 25 మంది ఆటగాళ్లను ఆడించిన ఫలితం మాత్రం లేకుండా పోయింది అంటూ రాబిన్ ఊతప్ప అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: