ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న టి20 వరల్డ్ కప్ మరికొన్ని రోజుల్లో జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ లో ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే వెస్టిండీస్ యూఎస్  వేదికలుగా జరగబోయే వరల్డ్ కప్ టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను బీసీసీఐ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇక మరికొన్ని రోజుల్లో భారత జట్టు ఆటగాళ్లు అందరూ కూడా అమెరికా పయనం కావడానికి రెడీ అవుతున్నారు అని చెప్పాలి.


 అయితే గత కొన్నెళ్ల నుంచి వరల్డ్ కప్ టోర్ని లో బాగా రాణిస్తూ ఉన్నప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం వెనకబడిపోతుంది టీమిండియా జట్టు. ఇక ఈసారి ఏం చేయబోతుంది అనే విషయం పైన అందరి కన్ను ఉంది. మరీ ముఖ్యంగా గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో ఫైనల్ వరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకొచ్చి తుది అడుగులో మాత్రం తడబడింది. అయితే ఈసారి మాత్రం పట్టుదలతో టైటిల్ గెలవాలని అనుకుంటుంది. కాగా టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్లు ఎవరు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ విషయం పైన ఎంతోమంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ.. ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.


 ఇదే విషయంపై టీం ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కూడా స్పందించాడు. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కోసం ఎంపికైన విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ జనరేషన్ లో అన్ని ఫార్మట్లలో కోహ్లీ బెస్ట్ బ్యాట్స్మెన్  అతను అన్ని రికార్డులను బ్రేక్ చేశాడు. రన్ మిషన్ ఖాతాలో ఒక వరల్డ్ కప్ ఉంది. అయితే ఖచ్చితంగా అతను దానితో సంతృప్తి చెందడు. అందుకే మరో వరల్డ్ కప్ ట్రోఫీకి చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అర్హుడు అని నేను భావిస్తున్నాను అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: