ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకే విషయంపై చర్చించుకుంటున్నారు. అదే నేడు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో విజేతగా గెలవబోయే జట్టు ఏది అని. కాగా నేడు జరగబోయే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడిపోతుంది. ఈ రెండు టీమ్స్ కూడా ఐపిఎల్ లో ఎంత అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి వారే సాటి అనే రేంజ్ లో ఇక ఈ రెండు టీమ్స్ ప్రదర్శన కొనసాగింది. అయితే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో ఏ జట్టు చేతిలో ఓడిపోయి రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడిందో.. సన్రైజర్స్ ఇప్పుడు రెండవ క్వాలిఫైయర్ లో గెలిచి తమను ఓడించిన కోల్కతాను ఓడించేందుకు సిద్ధమైంది.


 ఈ క్రమంలోనే సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఆ సమయం ఎప్పుడు అవుతుందో అని క్రికెట్ అభిమానులు అందరూ కూడా టీవీల ముందు కూర్చుని వేచి చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇలా కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండగా.. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక ఆసక్తికర ఘటన జరగబోతుంది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ధర పలికిన ఇద్దరు ప్లేయర్లు ఇలా ఫైనల్ మ్యాచ్లో తలబడబోతున్నారు అని చెప్పాలి.



 అయితే ఈ రెండు టీమ్స్ లో ఐపీఎల్ లోనే అత్యధిక ధర పలికిన ఇద్దరు ప్లేయర్లు ఉండడం గమనార్హం. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా కొనసాగుతున్న ప్యాట్ కమిన్స్ గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో 20.5 కోట్ల రూపాయలు ధర పలికాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ హిస్టరీలోనే ఇదే అత్యధిక ధర అని అనుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు  స్టాక్ ర్ 24.5 కోట్లు ధర పలికాడు. ఇక ఇద్దరు కాస్లీ ప్లేయర్లు ఫైనల్ మ్యాచ్లో సై అంటే సై అంటూ తలబడబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl