ఎన్నో రోజుల నుంచి భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అలరిస్తూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 2024 సీజన్ ముగిసింది. ఇటీవలే జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ఇక ఈసారి విజేతగా నిలువపోయే జట్టు ఏది అనే వ్యక్తి ఉత్కంఠకు తెరపడింది. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తంలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు.. టైటిల్ విజేతగా నిలిచింది. గతంలో అటు గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో రెండు సార్లు టైటిల్ అందుకున్న కోల్కతా జట్టు.. ఇక ఇప్పుడు అతను మెంటర్ గా ఉన్న సమయంలో అతని ఆధ్వర్యంలోనే మూడో టైటిల్ కూడా ముద్దాడింది. అయితే గత సీజన్ వరకు కూడా ఐపీఎల్ లో తడబడుతూ పేలవ ప్రస్తానాన్ని కొనసాగించిన కోల్కతా జట్టు అటు గంభీర్ మెంటర్గా రావడంతో ఎంతో దూకుడుగా ఆడుతూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తుంది అని చెప్పాలి. ఇక ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రానించి ఇక టైటిల్ విజేతగా నిలిచింది అని చెప్పాలి. ఇక ఇలా మెంటార్గా వ్యవహరిస్తూ అటు కోల్కతా జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించి టైటిల్ విజేతగా నిలపడంలో కీలకపాత్ర వహించిన గౌతమ్ గంభీర్ కి.. ఒక అదిరిపోయే గిఫ్ట్ అందిందట.


 ఏకంగా గంభీర్ చేతిలో ఒక బ్లాంక్ చెక్ పెట్టారట. ఏకంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కో ఓనర్ షారుక్ ఖాన్ ఆ జట్టు మాజీ ఆటగాడు ప్రస్తుతం మెంటర్ వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్ కు బ్లాంక్ చెక్ ఇచ్చాడట గౌతమ్ గంభీర్. ఎల్ఎస్జీలో ఉన్న సమయంలోనే రాబోయే పదేళ్లపాటు అటు కోల్కతా కోసం పని చేయాలి అని అటు షారుక్ ఖాన్ గౌతమ్ గంభీర్ ను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గౌతమ్ గంభీర్ చేతిలో బ్లాంక్ చెక్ ను షారుక్ ఖాన్ పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు అటు గౌతం ఇండియాకు హెడ్ కోచ్ గా మారబోతున్నాడు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl