భారత క్రికెట్లో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే   ఎందుకంటే ఎప్పటికప్పుడు యువ ఆటగాళ్లు మేమే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని తమ ఆట తీరుతో నిరూపించుకుంటూనే ఉన్నారు. కొంత మంది దేశవాళి క్రికెట్లో అద్భుతంగా రాణిస్తూ అదర గొడుతూ ఉంటే ఇంకొంతమంది తమ ఆటతో ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకుని ఇక ఈ మెగా టోర్నీలో కూడా ఛాన్సులు తగ్గించుకుంటున్నారు.


 వచ్చిన అవకాశాలను ఎంతో అద్భుతం గా సద్వినియోగం చేసుకుంటూ ఇక భారత జట్టు లోకి చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే సమయం  లో నేటి రోజుల్లో అటు టీమిండియా సెలెక్టర్లు కూడా ఇలా మంచి ఫామ్ లో ఉన్న యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ జట్టు లోకి సెలక్ట్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ లు కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే  ఈ ఇద్దరు ప్లేయర్లు అటు వరల్డ్ కప్ లోకి కూడా సెలెక్ట్ అవుతారని అందరు ఊహించారు. కానీ అలా జరగ లేదు.


 అయితే ఇలా ఐపిఎల్ టోర్నీ లో సన్రైజర్స్ జట్టు తరఫున ఆడుతూ అదర గొట్టిన ఇద్దరు ప్లేయర్లకు బిసిసిఐ బంపర్ ఆఫర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే జూలై లో జరిగే జింబాబ్వే పర్యటనకు వీరిని ఎంపిక చేయ బోతున్నట్లు సమాచారం. వీరితో పాటు ఐపీఎల్ లో రాణించిన హర్షిత్ రానా, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, విజయ్ కుమార్, యష్ దయాళ్ సహా మరి కొంతమంది ఎందుకు క్రికెటర్లను జింబాబ్వే పర్యటన కోసం సెలెక్ట్ చేయబోతున్నారట. అదే సమయంలో ఇక ఈ పర్యటనకు టీమిండియాకు తాత్కాలిక హెడ్ కోచ్గా ఎన్సీఏ ప్రెసిడెంట్ వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించ బోతున్నాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: