క్రికెట్ మ్యాచ్‌లలో ఆటగాళ్లు ఎక్కువగా చూయింగ్ గమ్ నములుతూ మనకి కనిపిస్తారు. కానీ ఇది అలవాటుగా చేసే పని మాత్రమే కాదు, దీని వెనుక చాలా మంచి కారణాలు ఉన్నాయి. క్రీడా ప్రపంచంలో చూయింగ్ గమ్ నమలడం ఎందుకు ఇంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు క్రికెట్ అంటే ఎంత ఫిజికల్లీ డిమాండింగ్ ఆటో. గంటల తరబడి జరిగే ఈ ఆటలో ఆటగాళ్లు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కో బంతి ఒక్కో క్షణం ఎంతో ముఖ్యమైనవి. ఈ పరిస్థితుల్లో ఆటగాళ్లు చల్లగా ఉండటం చాలా అవసరం. ఈ సమయంలో చూయింగ్ గమ్ నమలడం వల్ల మనసు ఒకేచోట ఫోకస్ చేయగలదు. ఇలాంటి అలవాటు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే, గమ్ నమలడం వల్ల ఆటగాళ్లు మ్యాచ్‌పై మరింత దృష్టి సారించగలుగుతారు.

దీని వెనుక మరో కొన్ని కారణాలను తెలుసుకుందాం. క్రికెట్ మైదానంలో ఎండలో గంటల తరబడి ఆడటం వల్ల ఆటగాళ్లకు చాలా చెమట పట్టేస్తుంది. దీంతో నోరు ఎండిపోతుంది. ఈ సమయంలో చూయింగ్ గమ్ నమలడం వల్ల నోటిలో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో నోరు ఎండిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా బౌలర్లు, ఫీల్డర్లు బంతిని విసిరేటప్పుడు లేదా తమ జట్టు సభ్యులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడటానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

కొంతమంది ఆటగాళ్లు గమ్ నమలడం తమ రోజువారీ అలవాటుగా చేసుకుంటారు. అంటే, ప్రతి మ్యాచ్‌కు ముందు గమ్ నమలడం వల్ల వారికి మంచి ఫీలింగ్ వస్తుందని నమ్ముతారు. ఉదాహరణకు, భారత జట్టు ఆటగాడు రోహిత్ శర్మ ఎప్పుడూ మ్యాచ్‌కు ముందు బబుల్ గమ్ అలవాటు చేసుకున్నాడు. అతని ప్రకారం, గమ్ నమిలితే అతను మరింత ఆత్మవిశ్వాసంతో, సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

అంతేకాదు, గమ్ నమిలితే పళ్ళు కొరికే అలవాటు నుంచి కాపాడుకోవచ్చు. ఒత్తిడి లేదా ఉత్సాహం వల్ల కొంతమంది ఆటగాళ్లు తమ పళ్ళను గ్రైండ్ చేస్తారు. ముఖ్యంగా మ్యాచ్‌లు కీలక దశలో ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు. ఈ సమయంలో గమ్ నమిలితే టీత్ ఎనామిల్ పొర దెబ్బ తినకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: