ఐపీఎల్‌ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 25లో తొలిసారిగా బుధవారం రాత్రి సూపర్ ఓవర్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ టై కావడం వలన సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయ దుందుభి మోగించారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఎన్ని సూపర్ ఓవర్ మ్యాచ్‌లు జరిగాయో అని జనాలు తెగ వెతుకుతున్నారు. వారి కోసమే ఈ ప్రత్యేక కధనం!

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు మొత్తం 17 సీజన్లు జరిగాయి. తాజాగా 18వ సీజన్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లలో సూపర్ ఓవర్‌లో ఫలితం తేలింది. ఐపీఎల్‌లో మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌ 23 ఏప్రిల్‌ 2009లో జరిగింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు మొట్ట మొదటి సారిగా సూపర్ ఓవర్ ఆడాయి. ఇరు జట్లు కూడా 20 ఓవర్లలో 150 పరుగులు చేయడంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి రావడంతో ఆడాయి. సూపర్ ఓవర్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 6 బంతులు ఆడి 16 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, రాజాస్థాన్‌ 4 బంతుల్లోనే విజయం ఛేదించింది.

ఇక 12 మార్చి 2010లో కింగ్స్‌ పంజాబ్‌ XI, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య చెన్నైలో సూపర్ ఓవర్ మ్యాచ్ జరగగా.. సూపర్ ఓవర్‌లో పంజాబ్ 18 పరుగులు చేసి విజయం సాధించింది. అదే విధంగా 16 ఏప్రిల్ 2013లో మరో సూపర్ ఓవర్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరగగా.. ఢిల్లీ కొట్టిన 12 పరుగులను 2 బంతుల్లోనే చేసిన ఏబీ డివిలియర్స్‌ బెంగళూరును గెలిపించాడు. అలాగే 19 ఏప్రిల్ 2013లోనే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాయల్ ఛాలెంజర్స్ మరో సూపర్ ఓవర్ ఆడడం జరిగింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు 130 పరుగులు చేయగా సూపర్ ఓవర్‌లో బెంగళూరు ఇచ్చిన టార్గెట్‌ను హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించి విజయ ఢంకా మోగించింది. ఇక 29  ఏప్రిల్ 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ కోల్‌కతా మధ్య జరిగిన సూపర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్  11 పరుగులు చేసి విజయం సాధించింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. 21 ఏప్రిల్ 2015లో కింగ్స్ పంజాబ్ XIతో రాజస్థాన్ రాయల్స్ ఆడాల్సి రాగా... పంజాబ్‌ సూపర్ ఓవర్‌లో 12 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 29 ఏప్రిల్ 2017లో ముంబై ఇండియన్స్‌, గుజరాత్ లయన్స్ మధ్య, 2 మే 2019లో ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ మధ్య, 8 మే 2019లో  ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా మధ్య, 20 సెప్టెంబర్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ మధ్య,
28 సెప్టెంబర్ 2020లో దుబాయ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌, ముంబై మధ్య, 18 అక్టోబర్ 2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ సన్‌సైజర్స్ మధ్య, 8 అక్టోబర్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ సూపర్ ఓవర్ ఆడాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL