
కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ పది సంవత్సరాల నుంచి సబ్ ఎయిర్‌సిస్టమ్‌ను వినియోగిస్తోంది. పిచ్‌తో పాటు మైదానంలోని పచ్చిక కింద పలు లేయర్లలో ఇసుకను నింపడం జరిగింది. మిగతా మైదానాల్లో లేయర్లలో ఎక్కువగా మట్టిని నింపారు. చిన్నస్వామిలో ఇసుక ఉండటం వల్ల నీరు మైదానంలో ఉండకుండా.. మెషిన్ స్టార్ట్ చేయగానే బయటకు వచ్చేస్తుందన్నమాట. 200 హార్స్‌పవర్ యంత్రాలతో సబ్‌ఎయిర్ సిస్టమ్ ఇక్కడ రన్ అవుతుంది. అక్కడి నుంచి డ్రైనేజ్‌ల ద్వారా నీటిని బయటకు పంపుతారు. ఆ తరువాత డ్రయర్లు, రోప్స్‌తో గ్రౌండ్‌ను సిద్ధం చేస్తారు. మోస్తరు వర్షం పడినా 15 నిమిషాల్లోనే చిన్నస్వామి మైదానాన్ని సిద్ధం చేయవచ్చు. సబ్‌ఎయిర్ సిస్టమ్ కారణంగా ఒక్క నిమిషంలోనే దాదాపు 10 వేల లీటర్ల నీరు బయటకి వెళుతుంది. ఇక గంటల పాటు వర్షం కురిసినా సరే, 30 లేదా 40 నిమిషాల్లో మైదానాన్ని సిద్ధం చేసేస్తారు.
అయితే ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు అయినటువంటి బీసీసీఐ దేశంలోని మిగతా అన్ని స్టేడియంలలో కూడా ఇటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. అయితే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ 2027 కల్లా మిగతా చోట్ల కూడా సబ్‌ఎయిర్ సిస్టమ్ వంటి వాటిని ఏర్పాటు చేసే దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే చిన్నస్వామి స్టేడియం బెంగళూరులోని కొలువైన అద్భుతమైన క్రికెట్ స్టేడియం. దీనిని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా పిలుస్తారు. బెంగుళూరు నగరం నడిబొడ్డున, చుట్టూ సుందరమైన కబ్బన్ పార్క్, క్వీన్స్ రోడ్, MG రోడ్‌లతో ఉన్న ఈ స్టేడియం దాదాపు 5 దశాబ్దాల నాటిదని సమాచారం. దీనిలో ఏకకాలంలో 40,000 మంది కూర్చునే సదుపాయం కలదు.