
ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లి అంపైర్ నిర్ణయంపై గొడవకి దిగుతున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఆర్‌సీబీ ఛేజింగ్‌లో కీలక పాత్ర పోషించిన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ కింగ్ కోహ్లీ కొద్దిసేపటి తర్వాత తిరిగి వెళ్లి బ్యాటింగ్ కొనసాగించడం కొసమెరుపు. ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున కేఎల్ రాహుల్ 39 బంతుల్లో 3 ఫోర్లతో అత్యధికంగా 41 పరుగులు చేశాడు. కాగా, ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు సాధించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఎనిమిది వికెట్లకు 162 పరుగులు చేసింది. ఆర్‌సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ అత్యధికంగా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ఈ లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా సాధించింది. కోహ్లీ 51 పరుగులు, కృనాల్ పాండ్య 73 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఇకపోతే... ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించడంతో... ఆర్‌సీబీ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. బెంగళూరు 10 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లను కలిగి ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆ జట్టులో కేఎల్ రాహుల్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కృనాల్ పాండ్య (47 బంతుల్లో 73*; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. దిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీకి ఇది ఏడో విజయం కావడం విశేషం.