
1984లో ‘ది ఐరన్ షేక్’ పై ఘనవిజయం సాధించడం హల్క్‌కు మొదటి WWF ఛాంపియన్‌షిప్ గెలుపును అందించింది. అదే విజయం అతని కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. పెద్దచిన్న తేడా లేకుండా అతని మ్యాచులు చూసేందుకు అభిమానులు తెగపడేవారు. అమెరికా జాతీయ గీతాలాపన, దేశభక్తి ఉద్దేశాలు, తాను ప్రదర్శించే ఫిట్‌నెస్ హోగన్‌ను అభిమానులకు మరింత దగ్గర చేసింది. అంతేకాదు, రెజ్లింగ్‌తో పాటు హల్క్ హోగన్ సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్‌లు వంటి పలు రంగాల్లో కూడా తన ముద్ర వేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా రాజకీయంగానూ చురుకుగా కనిపించారు.
ఓ ప్రచార సభలో తన స్టైల్‌లో టీషర్ట్ చించుకుంటూ చేసిన స్పీచ్ అక్కడున్నవారిని ఉర్రూతలూగించింది. స్వయంగా ట్రంప్ కూడా ఆయన్ను అభినందించారు. కొన్ని వారాల క్రితం హోగన్ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. కోమాలో ఉన్నారని వార్తలొచ్చాయి. అయితే ఆయన సతీమణి స్కై డైలీ వాటిని ఖండించి, "అతని గుండె చాలా బలంగా ఉంది, త్వరగా కోలుకుంటాడు" అని చెప్పడం ఇప్పుడు మరింత హృదయవిదారకంగా మారింది. ఒక్కసారి రంగంలోకి దిగితే రింగ్‌నే కదిలించేసే వ్యక్తిత్వం కలిగిన హల్క్ హోగన్ మృతితో రెజ్లింగ్ ప్రపంచంలో శూన్యత ఏర్పడింది. కానీ ఆయన సృష్టించిన "హల్క్ మానియా" మాత్రం ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోతుంది. గుడ్‌బై లెజెండ్… రెస్ట్ ఇన్ పీస్, హల్క్ హోగన్!