
2018 డిసెంబర్లో సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారుగా 10 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోతున్నామని ప్రకటించినప్పటికీ.. మళ్లీ తిరిగి నిన్నటి రోజున సైనా నెహ్వాల్ తన ఇంస్టాగ్రామ్ లో తన భర్త పారుపల్లి కశ్యప్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫోటోలకు ఇలా క్యాప్షన్ రాసుకుంది. "కొన్నిసార్లు దూరం మనిషి విలువను నేర్పిస్తుందని మేము మళ్ళీ ప్రయత్నిస్తున్నాం అంటూ చాలా ఎమోషనల్ గా ఒక నోట్ ని రాసుకొచ్చింది".
ఈ క్యాప్షన్ వారి మధ్య ఉన్న బంధాన్ని మాత్రమే కాకుండా విడిపోతున్న జంటలందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. విడాకుల ప్రకటన చేసినప్పటి నుంచి వేరువేరుగా ఉండడం ఒకరినొకరు ఎంత అవసరం అనే విషయం తెలుసొస్తుంది.. 2012 లండన్ లో సైనా నెహ్వాల్ ఒలంపిక్స్ లో కాంస్య పతాకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా సెట్లర్.. ఆ తర్వాత BWF వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్ గా గెలిచిన మొట్టమొదటి ఇండియన్ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది. 2015లో ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుని అందుకుంది సైనా నెహ్వాల్. పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే 2014లో కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం అందుకున్నారు.. 2012లో ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లారు.. ప్రస్తుతమైతే కోచ్గా స్థిరపడినట్లు సమాచారం.