తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ప్లేయర్‌తో ఆయన ఆత్మీయంగా సంభాషించి, వారి విజయాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. టీమ్ విజయంలో ప్రతి సభ్యురాలి కృషిని ప్రశంసిస్తూ, భారత జట్టు సాధించిన ఈ ఘనత దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు.సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, ఫైనల్ మ్యాచ్‌లో బంతిని తన జేబులో వేసుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. దానికి స్పందించిన హర్మన్ “అదృష్టవశాత్తూ ఆ బంతి నా దగ్గరకు వచ్చింది సార్, కాబట్టి దాన్ని గుర్తుగా నా దగ్గరే ఉంచుకున్నాను” అంటూ చెప్పడంతో సభలో అందరూ నవ్వులు పూయించారు.


అంతేకాకుండా, 2021లో ఇంగ్లాండ్‌పై హర్లీన్ డియోల్ పట్టిన అద్భుత క్యాచ్‌ను కూడా ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఆ స్ఫూర్తిదాయక క్షణాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఆ సంభాషణ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది.భారత జట్టుతో జరిగిన ఆ ఆత్మీయ సంభాషణలో సరదా క్షణాలూ చోటుచేసుకున్నాయి. ఒక్కొక్క ప్లేయర్ వరుసగా ప్రధాని మోదీతో మాట్లాడుతుండగా, హర్లీన్ డియోల్ మాట్లాడే సమయం వచ్చినప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఆమె మైక్‌ తీసుకుని సరదాగా అడిగింది – “సార్, మీ స్కిన్ ఎప్పుడూ ఇంత మెరుస్తూ ఉంటుంది ఎలా?” అని అడిగింది. ఆమె ప్రశ్న విన్న వెంటనే ప్రధాని మోదీతో పాటు అక్కడున్న అందరూ పెద్దగా నవ్వేశారు.



ఆ ప్రశ్నకు మోదీ గారు చిరునవ్వుతో స్పందిస్తూ – “నేను వాటి గురించి అంతగా ఆలోచించను,” అని సరదాగా చెప్పారు. వెంటనే జట్టు సభ్యుల్లో ఒకరు చమత్కారంగా “సార్, ఇది దేశంలోని కోట్లాది మందికి మీపై ఉన్న ప్రేమ వల్లే!” అని చెప్పగానే మళ్లీ అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.ఆ సరదా వాతావరణంలో ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కూడా స్పందిస్తూ, “చూశారా సాసర్, ఇలాంటి వాళ్లను నేనే రోజూ డీల్ చేయాలి. అందుకే నా జట్టు వెంటనే తెల్లబడిపోతుంది,” అంటూ హాస్యభరితంగా అన్నారు. సమావేశం చివరగా ప్రధాని మోదీ జట్టుకు భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, వారి కృషి యువతకు ప్రేరణ కావాలని సూచించారు. ఈ సందర్భం దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ అభివృద్ధి పట్ల గర్వభావాన్ని కలిగిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: