ఇండియన్ మార్కెట్లో మరో స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్ ?

ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన మఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ గొగొరో తన రెండు విద్యుత్ శ్రేణి స్కూటర్లను ఇండియన్ మార్కెట్లో కి తీసుకొచ్చింది. మార్చుకోదగిన బ్యాటరీలను అందించడంలో టాప్ కంపెనీగా గొగొరో కి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు విజయవంతమైన హోమోలోగేషన్ సర్టిఫికేషన్ తో గొగొరో2, గొగొరో 2 ప్లస్ సిరీస్ బైక్స్ తో మన దేశంలో అడుగు పెడుతోంది. ఈ బైక్స్ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ఇన్‌స్టిట్యూట్ వెరిఫై చేసింది.ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక గొగొరో బైక్స్ సాధారణ రేంజ్ సింగిల్ చార్జ్ పై ఏకంగా 170కిమీ వస్తుంది. అయితే ఇండియాలో మాత్రం ఇది 84 కిలోమీటర్లు ఇంకా 97 కిలోమీటర్లుగా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇతర దేశాలలో అయితే ఈ బైక్ కి రెండు మార్చుకోదగిన బ్యాటరీలు వస్తాయి. 


అందువల్ల ఎక్కువ కిలోమీటర్లు వస్తుంది. అయితే మన దేశంలో మాత్రం కేవలం ఒక బ్యాటరీకి మాత్రమే సర్టిఫికేషన్ ని తీసుకుంది.అందువల్ల మైలేజీ ఇండియాలో తక్కువగా ఉంది.గొగొరో 2 ప్లస్ బైక్ chaa3 రకాల సేఫ్టీ , కంఫర్ట్ ఫీచర్లను కలిగి ఉంది. దీని టైర్ లో ఉండే ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మీకు ఎల్లప్పుడూ సురక్షితమైన ఇంకా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అలాగే ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు చాలా అద్భుతమైన స్టాపింగ్ పవర్‌ను అందిస్తాయి. సేఫ్టీ ఫీచర్స్ తో పాటు గొగొరో 2 ప్లస్ ప్రీమియం లుక్ కూడా అదరగొడుతుంది.మెరుస్తూ నిగనిగలాడే మెటాలిక్ బాడీ ప్యానెల్‌లు ఇంకా మెటాలిక్ సీట్ బ్యాడ్జ్ చూపరులను ఆకట్టుకొని కట్టిపడేస్తాయి.అలాగే డ్యూయల్-టోన్ ఫినిష్డ్ డ్యాష్‌బోర్డ్ కూడా బైక్ కి మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: