హౌసులో సన్నిహితంగా ఉండే అమ్మరాజశేఖర్ మరియు సోహెల్ ల మధ్య వివాదం మొదలయింది. బుధవారం జరిగిన ఎపిసోడులో మాస్టర్‌పై అరిచినందుకు సోహైల్ తన దగ్గరకు వచ్చి మాస్టర్ కాళ్లు పట్టుకున్నారు. సోహైల్ మాస్టర్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాడు. మాస్టర్ కూడా సోహెల్ ని దగ్గరకు తీసుకుని తన మీద కోపం లేదని నువ్వే నన్ను అర్థం చేసుకోకుండా నా దగ్గర కాయిన్లు తీసుకున్నావ్ అని హితబోధ చేశాడు.