టెలివిజన్ రంగంలో ఇప్పటివరకు ఎన్నో రియాలిటీ షో లు గేమ్ షో లు వచ్చాయి. వీటిలో కొన్ని ప్రజల అభిమానాలాలను పొంది సక్సెస్ అయ్యాయి. మరి కొన్ని ప్రజల అంచనాలను అందుకోవడంలో నిరాశ పరిచాయి. వీటిలో ముఖ్యంగా మన భారతదేశంలో కౌన్ బనేగా కరోడ్ పతి అనే గేమ్ షో కి వచ్చినంత ఆదరణ ఏ షో కు రాలేదనే చెప్పాలి. ఈ షో కు వ్యాఖ్యాతగా మన బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యవహరించారు.