విశ్వక్ సేన్‌.. వెళ్లిపోమాకే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈయ‌న ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ త‌ర్వాత ఈయ‌న‌ హీరో కమ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా ఫలక్ నుమా దాస్.  లాస్ ఫ్రై డే రిలీజైన ఈ సినిమా పక్కా మాస్ మూవీగా ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక విశ్వ‌క్ సేన్ హీరోగా నాచురల్ స్టార్ నాని నిర్మించిన తాజా చిత్రం హిట్ ఇటీవ‌ల విడుద‌ల మంచి టాక్ తెచ్చుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇదిలా ఉంటే.. విశ్వక్ వర్సెస్ విజయ్.. ఇటీవ‌ల‌ సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన‌ లైన్ ఇదే.

ఎప్ప‌టిక‌ప్పుడు ఈ హీరోల ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వేదిగా మాట‌ల యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రి మ‌ధ్య వార్ స్టాట్ అయ్యే సూచ‌న‌లు పుష్క‌లంగా క‌నిపిస్తుంది. తాజాగా విశ్వక్ సేన్.. ఈటీవీ మోస్ట్ ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్‌లో ఒక‌టైన క్యాష్ షోలో మెర‌వ‌నున్నారు. విశ్వక్ సేన్ తో పాటుగా టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, వర్షిణి మరియు సుశాంత్ రెడ్డిలు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుద‌ల అయింది. దీన్ని చూస్తుంటే..  మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ తో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అర్థం చేసుకోవ‌చ్చు.

అలాగే ఈ షో ప్రోమోలో విశ్వక్ సేన్ తో పాటుగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్, వర్షిణి మరియు సుశాంత్ రెడ్డి పండించిన కామెడీ ఓ రేంజ్‌లో ఉంద‌ని చెప్పాలి.  కానీ లాస్ట్ లో మాత్రం విశ్వక్ చెప్పిన కొన్ని స‌మాధాల‌తో ఆ సారి దబిడి దిబిడే అయ్యేలా క‌నిపిస్తుంది . వాస్త‌వానికి ఇప్పటి వరకు విజయ్ కానీ విశ్వక్ కానీ ఇద్దరూ ఒకరికోసం ఒకరు మాట్లాడుకున్నది లేదు. కానీ మొట్ట మొదటిసారిగా క్యాష్ స్టేజ్ పై అట్టిట్యూడ్ అంటే విజయ్ అని విశ్వక్ అనేసాడు. మరి అది ఎందుకు అన్నాడో.. ఎలాంటి సందర్భంలో అనాల్సి వచ్చిందో.. తెలియాలి అంటే వ‌చ్చే శ‌నివారం వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: