బిగ్ బాస్ 4 విన్నర్ అభిజిత్ షో నుంచి బయటకు రాగానే ఫుల్ బిజీ అయిపోతాడు అని అందరూ అనుకున్నారు. కానీ షో లో పాల్గొన్న అందరూ బిజీ అయ్యారు..కానీ మనోడు మాత్రం పులి వేటకు సమయం కావాలి అంటూ ఏవో కాకమ్మ కబుర్లు చెప్పాడు. ముందు నుంచి అలానే ఉన్నాడు.మొదటి నుంచి చివరకు ఒకేలా ఉండి.. ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడంతో అందరూ ఫిదా అయ్యారు. ఎక్కడా కూడా అతిని ప్రదర్శించకుండా.. ఎక్కడ ఎలా మాట్లాడాలి.. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్నాడు. చివరకు బిగ్ బాస్ నాల్గో సీజన్ విజేతగా నిలిచాడు.



బిగ్ బాస్ వల్ల వచ్చిన ఇమేజ్‌ను చక్కగా వాడకుని ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేయాలని అభిజిత్ బాగా ప్రయత్నిస్తున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమా తరువాత మళ్లీ అభిజిత్ తెరపై కనిపించలేదు. అందుకే ఇలా బిగ్ బాస్ ఇమేజ్‌తో మంచి హిట్ కొట్టేసి స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.వెయిట్ చేస్తున్నాడు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచీ అభిజిత్ తనకు సరిపోయే కథ, స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నట్టు చెప్పాడు.రోజంతా కూర్చుని కథలు వింటూ ఉండేవాడట. కంటిన్యూగా రెండు మూడు గంటలు కథలు వింటూ ఉన్నానని సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని అభిజిత్ తెలిపాడు.



అరియానా, అఖిల్, మోనాల్ వంటి వారంతా కూడా తమ తమ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేశారు. సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ అభిజిత్ ఒక్కడే కాస్త ఆలస్యం చేస్తున్నాడు. దీంతో అభిమానులు గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు.. తాజాగా అభిజిత్ మాత్రం ఓ పోస్ట్ చేశాడు. అందులో సింపుల్‌గా తాను చెప్పాల్సింది చెప్పేశాడు. రేపే అనౌన్స్ మెంట్స్ చూస్తూనే ఉండండి అంటూ చెప్పేశాడు. ఇక ఈపోస్ట్‌తో అభిమానులు చెలరేగిపోతోన్నారు... అయితే నిజంగా ఆ అప్డేట్ ఇచ్చాడా? లేదా అనేది చూడాలి.. మొత్తానికి మనోడు ఎలాగైనా సక్సెస్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎటువంటి కథతో సినిమా తీస్తాడు  అనేది ఆసక్తిగా మారింది...

మరింత సమాచారం తెలుసుకోండి: