సినిమా ఇండస్ట్రీలో బ్రతకడం అంటే అంత ఈజీ కాదు.. అవకాశాల కోసం భారీగానే పోటీ ఉంటుంది.. నటుడు అవ్వాలన్న, దర్శకుడు అవ్వాలన్న, నిర్మాత అవ్వాలన్నా సినిమా ఇండస్ట్రీ లో ఏ చిన్న పాత్ర వహించాలన్న కూడా పోటీ మాత్రం గట్టిగానే ఉంటుంది.. పోనీ అవకాశం వచ్చాక ఆయన కుదుట పడతామా అంటే అప్పుడే మరింత బాధ్యత పెరుగుతుంది.. ఓ నటుడు అవకాశం వచ్చిన తర్వాత మళ్లీ దాన్ని నిలబెట్టు కోవటం చాలా కష్టంతో కూడుకున్న పని.. అప్పటికే తాను చేసిన ఒకతో రెండో సినిమాలతో ప్రేక్షకులకు కొంత పరిచయం అవుతుంది..

దాంతో బయటికి వెళ్లి కనబడ లేని పరిస్థితి.. ఇండస్ట్రీ లో అవకాశాలు రాని పరిస్థితి.. ఈ రెండిటి మధ్య నలిగిపోతూ సగం సగం ఫేం తో అష్టకష్టాలు పడుతూ ఉంటారు నటులు.. ఇలాంటి వారు ఒక్క టాలీవుడ్ లోనే కాదు చాలా పరిశ్రమల్లో అవస్థలు పడుతున్నారు.. అవకాశం కోసం ఎదురుచూసి ఒకటి రెండు అవకాశాలు అందిపుచ్చుకొని వాటిలో నటించి కొంత ఇమేజ్ దక్కించుకున్నా మళ్లీ అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.. అలా కపిల్ శర్మ ఫేం నటి సుమోన చక్రవర్తి తన కష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పెంచుతుంది..

లాక్ డౌన్ టైంలో చేతిలో అవకాశాలు లేక , డబ్బుల్లేక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాను అని ఆమె తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.. నేను  గర్భాశయ వ్యాధితో నాలుగేళ్లుగా బాధపడుతున్నానని, ఈ లాక్ డౌన్ టైంలో నా పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని ఆమె వెల్లడించారు.. సినిమా వారి జీవితం బయటికి కనిపించే అంత అందంగా ఉండదు అని మాకు కూడా చాలా కష్టాలు ఉంటాయి అని, అందరి మనషులాగానే  ఈర్ష్యా, ద్వేషాలు ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు.. ఎంతటి కష్టమైనా ఓర్పుతో నేర్పుతో గెలిచి జీవితంలో విజయం సాధించాలని ఆమె చెప్పుకొచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: