ఈ కారణంగా జెస్సీ మరింత బాధతో కుమిలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన నామినేషన్ కాస్త డిఫరెంట్ గా జరిగింది. బిగ్ బాస్ ఈ వారం ఇంటి కెప్టెన్ గా ఉన్న అని మాస్టర్ కి నలుగురిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇవ్వగా...ఆవిడ నామినేషన్ పై బయట వ్యతిరేకత పెరుగుతోంది. టార్గెట్ చేసినట్లుగా...మొదట టపి టపిమని కాజల్, సన్ని, మానస్ లను నామినేట్ చేసి జైలుకి పంపిన అని మాస్టర్ ఆ తర్వాత నాలుగో వ్యక్తిగా ఎవరిని నామినేట్ చేయాలా అని తెగ హైరానా పడ్డారు..ఎందుకంటే మిగిలిన వారంతా తనతో చాలా సన్నిహితంగా ఉన్నవారే...దాంతో చాలా ఎమోషనల్ అయ్యింది.
ఇక్కడే చాలా మంది ప్రేక్షకులకు అని మాస్టర్ ప్రవర్తన నచ్చలేదు. అప్పటి వరకు టార్గెట్ చేసి మరీ వెంటనే కాజల్, సన్ని, మానస్ లను చేసినట్లుగానే చేసుంటే సరిపోయేది. అంతా ఎమోషనల్ ఎందుకు అయ్యారు మీకు నచ్చిన ఇంటి సభ్యులు కాబట్టే కదా అంటూ మండిపడుతున్నారు. మరి ఈ వైఖరిని ఎప్పటికి మార్చుకుంటుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి