బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో ఆట చివరి దశకు చేరుకోవడంతో నిజంగా ప్రాణం పెట్టి ఆడుతున్నారు కంటెస్టెంట్స్. నిన్నటి ఎపిసోడ్ లో ఫైనలిస్ట్ టాక్ నడిచింది ఇందులో గెలిచిన వారు నేరుగా ఫైనల్స్ కి చేరుకోవచ్చు. అందుకే ప్రతీ కంటెస్టెంట్ తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించారు. మరి ఐస్ లో కాళ్ళను అలానే పెట్టుకొని ఉండాలంటే సామాన్యమైన పని కాదు. అయినా సరే అందరూ కూడా ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ క్రమంలో మొదటి సిరి సన్నీ ఐస్ లో నుండి కాళ్ళు బయట పెట్టిన తరుణంలో అతడి బాల్స్ ను కిందకు నెట్టేసింది. ఇక దాంతో ఫైర్ అయిన సన్నీ అసలు గేమ్ ఆడటం మొదలు పెట్టాడు. శ్రీరామ్, పింకీ, షన్ను మరియు సిరి లకు చుక్కలు చూపిస్తూ గేమ్ ను ఆడాడు.

సన్నీ దెబ్బకి సిరి కనీసం బయట కాలు పెట్టడానికి కూడా ధైర్యం చేయలేక అలానే చాలా సేపు ఉండి పోయింది. దీంతో షన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నావ్ అంటూ సిరి గురించి మనసులో పెట్టుకుని సన్నీపై ఫైర్ అయ్యాడు. సన్ని అప్పుడు అవేమీ పట్టించుకోకుండా   గేమ్ పై ఫుల్ ఫోకస్ పెట్టినప్పటికీ ఆ తరవాత గార్డెన్ లో కూర్చుని ఎమోషనల్ అయ్యారు. వాళ్ళు ఏమి చేసినా అది గేమ్ నేను చేస్తే మాత్రం ఆటిట్యూడ్, వాళ్ళని కావాలనే టార్గెట్ చేయడం అని అంటున్నారు అంటూ చాలా ఫీల్ అయ్యారు. మానస్, కాజల్ లు వచ్చి సన్ని ని ఓదార్చారు.

అయితే ఈ టాస్క్ సమయంలో షన్ను కావాలనే సన్ని ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, అతడు మాటపై మాట అంటూనే ఉన్నాడని సన్ని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. నువ్వు సిరి కోసం గేమ్ ఆడుకోపో చిన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు.  ఇక ఈ టాస్క్ అయ్యాక సిరి, షన్ను ఎవరి బెడ్ వారు పడుకొని గేమ్ గురించి మాట్లాడుతుండగా...మద్యలో ఏమైందో ఏమో గానీ మళ్ళీ షన్ను దుప్పటిలోకి వచ్చి చేరిపోయింది సిరి. ఒకే దుప్పటిలో ఇద్దరు ఉన్నారు. సిరి షన్నుని గట్టిగా హగ్ చేసుకుని మరీ మాట్లాడుతుండగా ఈ వీడియో కాస్త కెమెరాల ముందు హైలెట్ అయ్యింది. దీని గురించి నెటిజన్ల నుండి మళ్లీ కామెంట్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: