ఆన్ స్టాపబుల్ మొదటి సీజన్ ఎంతమంది జీవితాలను మార్చింది. బాలకృష్ణ తో పాటు ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసిన గెస్టులు ఎంతో మంది సహాయాన్ని అందించి ఎంతోమంది జీవితాలను మార్చారు.ఇలాంటి ప్రోగ్రాం మరింత మందికి చేరువ చేయడం కోసం ఆహా మరొకసారి తన ముందడుగు వేస్తోంది. నందమూరి హార్డ్ కోర్ ఫాన్స్ అందరు సే నో టు పైరసీ అని ముందుకు రావాలని కోరింది. అన్ స్టాపబుల్ సీజన్ 1 లో అక్రమంగా పలు వెబ్సైట్లో తమకు సంబంధించిన కొన్ని వీడియోస్ అందుబాటులో ఉన్నాయని ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ పోరాటం చేయడానికి ఆహ ముందడుగులు వేస్తోంది అని ఆహా సంస్థ తెలియజేసింది..అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె -2 ను ఎవరైనా పైరసీ చేసినట్లు అయితే వెంటనే ఆ పైరసీకి సంబంధించిన ఫోటోలను వీడియోలను జత చేస్తు..9393950505 / ఎపిసి50505@gmail.com ల వివరాలను తెలియజేయాలని ఆహా సంస్థ ప్రేక్షకులను కోరుకుంటుంది. అలాంటి వ్యక్తులు లేదా సంస్థలపై ఆహా వారు చట్టపరమైన సివిల్ క్రిమినల్ కేసులకు ద్వారా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆహ సీఈవో అజిత్ ఠాగూర్ తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారుతోందని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి