జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న రచ్చ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతర టీం సభ్యులతో కమెడియన్ గా కొనసాగిన ఈయన ఎక్కువగా చమ్మక్ చంద్ర టీం తోనే కొనసాగారు. ఆ తర్వాత తానే స్వయంగా టీంతో లీడర్ గా మారి ప్రేక్షకులను బాగా అలరించారు . చాలా రోజుల వరకు టీం సభ్యులతో జబర్దస్త్ లోనే కొనసాగిన ఈయనకు జబర్దస్త్ ద్వారానే మంచి గుర్తింపు లభించింది. అయితే ఉన్నట్టుండి జబర్దస్త్ నుంచి బయటకు రావడంతో అతనిపై చాలా రకాల గాసిప్స్ కూడా వచ్చాయి.

కొంతమంది సీనియర్ కమెడియన్స్.. ఎలాగైతే గొడవలు పడుతూ బయటకు వచ్చారు.  ఇప్పుడు రచ్చ రవి కూడా మల్లెమాల వారితో విభేదాలు వచ్చి బయటకు వచ్చాడు అంటూ రకరకాలుగా చేశారు.. అయితే జబర్దస్త్ వదిలేయడానికి గల కారణాన్ని చెబుతూ జబర్దస్త్ నాకు తల్లి లాంటిది.. సినిమాలలో అవకాశాలు రావడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేదు.అందుకే  జబర్దస్త్ మానేశాను అంటూ తెలిపారు. ఆర్థికంగా సినిమాల్లోకి వచ్చిన తర్వాతనే స్థిరపడ్డాను అంటూ తెలిపినాయన తన సొంత ఇంటి కలని బ్రహ్మానందం వల్లే పూర్తి చేసుకున్నాను అంటూ తెలిపారు.

టీవీలో కొన్నిసార్లు ఆయన నా కామెడీ చూసి నన్ను ప్రత్యేకంగా పిలిపించి మరీ మాట్లాడారు.  చాలా ప్రశంసించారు.. ఒకసారి బ్రహ్మానందం గారు ఫోన్ చేసి వెంటనే ఒక ఇల్లు కొనుక్కోవాలని స్వయంగా ఫ్లాట్ చూపించాడు అంటూ రవి తెలిపారు.. రూ.5 లక్షలు తక్కువైనా పర్లేదు.. నేను ఇస్తానని  వెంటనే ఫ్లాట్ కొనుక్కోమని బ్రహ్మానందం గారు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.  నా జీవితంలో ఎవరి దగ్గర అప్పు చేయకూడదని డిసైడ్ అయ్యి.. నా డబ్బుతోనే ఇంటిని కొనుగోలు చేశాను. ఆయన నా గృహప్రవేశానికి కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు.  అలాగే మా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఫోటోలకు స్టిల్ కూడా ఇచ్చారు అంటూ చాలా ఆనందంగా రచ్చ రవి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: