బిగ్ బాస్ అఖిల్ సార్ధక్ తాజాగా గాయపడినట్లు సమాచారం. అయితే అందుకు సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియోను ఆయనే పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత ఆందోళనలు కలిగిస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. పూర్తి వివరాల్లోకెళ్తే బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తున్నారు మా నిర్వాహకులు.. ఈ క్రమంలోని బీబీ జోడీ పేరుతో ఒక డాన్స్ షో ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతుంది.

ఇందులో బిబి జోడి పేరుతో ఒక డాన్స్ షో ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతుంది ఇందులో తేజస్వినితో కలిసి అఖిల్ పెర్ఫార్మన్స్ చేస్తున్నాడు.  అయితే తాజాగా ఆ డాన్స్ పెర్ఫార్మెన్స్ లో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది.. ఎందుకంటే ఎప్పటినుంచో తనకు పొత్తి కడుపు దిగువన నొప్పిగా ఉన్నప్పటికీ తాను డాన్స్ చేస్తూ వచ్చాను అని అయితే ఇప్పుడు అది కాస్త ఎక్కువ అవ్వడంతో భరించలేనంత నొప్పిగా మారింది. దాంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అంటూ తెలిపారు అఖిల్.

అఖిల్ ఒక వీడియోని పోస్ట్ చేస్తూ నా నొప్పి ఆడియోస్ కు కనిపించదు షో మధ్యలో నుంచి నేను వెళ్లిపోయానని అందరూ అనుకున్నారు.  అయితే మేము దిగువ నుంచి టాప్ టు లో ఉన్నాం అనేది చాలా షాకింగ్ గా అనిపిస్తుంది నాకు.. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కి రాలేనని ఛానల్ వాళ్లకు కూడా చెప్పాను అందుకేనేమో ఇలా చేసి ఉంటారు మమ్మల్ని కిందకు లాగితే మరో జోడిని సేవ్ చేయొచ్చు అనేది బహుశా కూడా కావచ్చు.. ఎంతో కష్టపడ్డాము నొప్పితో నేను ఎంత బాధ పడ్డానో ఎవరు కూడా అంత త్వరగా నమ్మరు.

నాకు వెళ్లాలని ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఊరికే ఉంటాను ఎప్పుడో వెళ్లే వాడిని కదా ఇంతలా ఎందుకు కష్టపడతారు అయినా సరే ఇన్ని రోజులు మీరు ఇచ్చిన సపోర్ట్ తో ముందడుగు వేశాను ధన్యవాదాలు మరో షో తో మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ ఎమోషనల్ అవుతూ అఖిల్ పోస్ట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: