తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ సంవత్సరాల తరబడి వినోదాన్ని పంచుతూ ఉత్కంఠ రేపుతూ మహిళలను టీవీలకే కట్టిపడేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది ఈ సీరియల్స్ లో నటించే నటీనటుల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా బుల్లితెర నటీమణుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై సంవత్సరాల తరబడి ప్రేక్షకులను అలరిస్తున్న బుల్లితెర నటీమణుల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

ప్రియాంక జైన్:
జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తున్న ప్రియాంక జైన్ తన నటనతో, అందంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. చాలా మంది ఈమె కోసమే సీరియల్ చూస్తున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఈమె డిగ్రీ కంప్లీట్ చేశారు.

భావన లాస్య:
మల్లి సీరియల్ లో నటిస్తున్న భావన లాస్య కూడా తన నటనతో అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈమె బీబీఏ కంప్లీట్ చేసి మోడల్ రంగంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత సీరియల్స్ లోకి ప్రవేశించింది.

రక్షా గౌడ:
గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తున్న రక్షా కూడా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

దేబ్జని మోడక్:
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో నటిస్తున్న దేబ్జని మోడక్ డిగ్రీ కంప్లీట్ చేశారు.

కీర్తి భట్:
మనసిచ్చి చూడు సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె బిగ్ బాస్ లో కూడా ప్రేక్షకులను అలరించింది. అక్కడ  తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

సిరి హనుమంత్:
సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో నటించిన సిరి హనుమంతు ఎంబీఏ పూర్తి చేశారు.

చైత్ర రాయ్:
సీరియల్స్ తో పాటు ఇటీవల ఎన్టీఆర్ సినిమాల్లో కూడా అవకాశం దక్కించుకున్న చైత్ర రాయ్ హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: