దీని తర్వాత ఆలీ ఏదైనా ఒక కొత్త షో తో మళ్లీ వస్తారా అని అందరూ కామెంట్లు చేశారు. కానీ ఎవరు ఏ విషయం చెప్పలేదు. అయితే తాజాగా అదే టీవీ ఛానల్ నుంచి ఆలీ హోస్టుగా మరో కొత్త ప్రోగ్రాం రాబోతోంది అంటూ ప్రకటించారు. ఆ షో పేరు ఆలీతో ఆల్ ఇన్ వన్. ఇటీవలే ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేయగా నటుడు ఆలీ అదే ఉత్సాహంతో మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ గా మారింది. గతంలో అదే చానల్లో ఆలీ హోస్ట్ గా చేసిన ప్రోగ్రామ్లకు మంచి క్రేజీ లభించడంతో ఈ కార్యక్రమం ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసింది .
ఇప్పుడు ఈ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలను తీసుకువచ్చి వారి పాత జీవితాలను గుర్తు చేసేవారు. అలా ఆ షో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే కార్యక్రమంలో ఆటలు, పాటలు, గేమ్స్, డాన్స్ ఇలా అన్నీ కలిసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేశారు కమెడియన్ అలీ. ఈసారి ఇందులో సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. మొదటి ఎపిసోడ్లో సిరి హనుమంత్, అమర్ దీప్ , ముక్కు అవినాష్ వచ్చి సందడి చేయగా వారితో రకరకాల టాస్కులు కూడా చేయించారు. ఇవన్నీ కూడా చాలా సరదాగా కనిపిస్తున్నాయి. మరి ఈ షో ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి