స్టేజ్ కార్యక్రమాలలో ఒకప్పుడు మ్యాజిక్ షో చేస్తూ తన కెరీర్ ని మొదలుపెట్టిన సుడిగాలి సుదీర్ తెలుగు రెండు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.. బుల్లితెరపై మకుటం లేని రారాజుగా ఒక వెలుగు వెలిగిన సుధీర్ సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా సుదీర్ , రష్మీ జంటకి విపరీతమైన క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది. ఈటీవీలో వచ్చే ఏ షో లో అయినా సరే గతంలో ఎక్కువగా సుడిగాలి సుదీర్ కనిపించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. బుల్లితెర నుంచి వెండితెర మీదికి షిఫ్ట్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి.

అయినప్పటికీ హీరో గానే ట్రై చేస్తున్నాడు తప్ప బుల్లితెర పైన కనిపించడానికి ఇష్టపడడం లేదు.. దీంతో అభిమానుల సైతం చాలా ఆందోళనకు గురవుతున్నారు. జబర్దస్త్ చేస్తున్న సమయంలో సుధీర్ సినిమాలలో నటించారు ఆ సమయంలోనే సినిమాలకు మంచి క్రేజ్ వచ్చేది కానీ ఇప్పుడు సినిమాలు చేయకపోవడంతో పెద్దగా ప్రేక్షకులు సుధీర్ ని పట్టించుకోవడంలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా కాలింగ్ సహస్ర అనే సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాని పట్టించుకోలేదని సమాచారం.


మరి సుధీర్ రాబోయే రోజుల్లో నటించే సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేలా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వస్తున్న సినిమాల కంటె సుదీర్ మళ్ళీ బుల్లితెర పైన కనిపిస్తే చూడాలని కోరుకునే అభిమానులు ఎక్కువమంది ఉన్నారట. ఈ విషయం సుధీర్ వద్ద వరకు వెళ్లడంతో సుధీర్ కూడా త్వరలోనే అందుకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. సుధీర్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. వీటికి కూడా పెద్దగా బస్ క్రియేట్ కాలేకపోవడంతో సుధీర్ త్వరలోనే బుల్లితెర పైన రీ యంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: