తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో జబర్దస్త్ షో కూడా ఒకటి.. ఈ జబర్దస్త్ కార్యక్రమంలో దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి బుల్లితెరపై ప్రసారమవుతు టీఆర్పీ రేటింగ్ లో బాగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎంతోమంది కమెడియన్స్ కూడా వెండితెరకు పరిచయం చేసింది. అలాగే పలువురు యాంకర్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేయడం జరిగింది. గతంలో ఉన్నట్లుగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోవడం జరిగింది. త్వరలోనే ఈ షోని క్లోజ్ చేయబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.


అయితే ఈ విషయం పైన మల్లెమాల వారు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు.. ఇందులో పాల్గొనే కమెడియన్సు సైతం డబల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే పనిలో పడడం జరిగింది. గతంలో ఉన్నంత క్వాలిటీగా ఇప్పుడు స్కిట్లలో లేదని పలు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. చాలామంది కమెడియన్ల స్కిట్ లలో భాగంగా రష్మీ  ని కూడా ఇన్వాల్వ్ అవుతూ అప్పుడప్పుడు పలు రకాల పంచులను వేస్తూ ఉంటుంది. కమెడియన్స్ కూడా అప్పుడప్పుడు రష్మీ మీద పలు రకాల పంచు డైలాగులు వేస్తూ ఉంటారు.


తాజాగా రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కు సంబంధించి ఒక ప్రోమోని సైతం విడుదల చేయగా అది వైరల్ గా మారుతోంది. ఈ ప్రోమోలో భాగంగా రష్మీకి గుండు కొట్టిస్తానంటూ మరొక జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ చేసిన వాక్యాలు పెను దుమారాన్ని రేపేలా చేస్తున్నాయి. ముఖ్యంగా తన భార్య సుజాతతో కలిసి చేసేటువంటి స్కిట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. స్కిట్ లో భాగంగా సుజాత ఎంతో భక్తి కలిగిన అమ్మాయిగా కనిపిస్తుంది.. ఈ భక్తి కారణంగా వీరి కాలనీలో ఉన్న వారందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఇలాంటి సమయంలో రాకింగ్ రాకేష్ రష్మీకి గుండు కొట్టిస్తానంటూ మొక్కున్నాదంటూ కామెంట్స్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రష్మీ షాక్ కావడం జరుగుతుంది.. ఎందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: