తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన హైపర్ ఆది. తన కామెడీ టైమింగ్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వకముందు హైపర్ ఆది ఎన్నో ఉద్యోగాలు కూడా చేశారు. అయితే అవన్నీ తనకు సంతృప్తిని ఇవ్వలేదని చివరికి కొంతమంది సపోర్టుతో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా సక్సెస్ అయ్యారు. అలా పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకొని భారీగానే సంపాదిస్తున్నారు.


హైపర్ ఆది తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోకే ఈమధ్య దూరమై.. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో చేస్తూ ఉన్నారు హైపర్ ఆది. ముఖ్యంగా హైపర్ ఆది ఇటీవలే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో కూడా స్టార్ క్యాంపెనర్ గా ప్రచారంలో పాల్గొంటున్నారు హైపర్ ఆది.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను జబర్దస్త్ కార్యక్రమంలో జరిగిన విషయాలను తెలియజేశారు.


ముఖ్యంగా అనసూయతో ఉన్నటువంటి బాండింగ్ ను కూడా తెలియజేశారు హైపర్ ఆది.. ముఖ్యంగా ఆమె తన స్కిట్లకు కూడా బాగా సపోర్ట్ చేసి ఎంజాయ్ చేస్తుందని తెలియజేశారు. ఒక రకంగా చెప్పాలి అంటే తను పాపులర్ కావడానికి అనసూయ కూడా ఒక కారణమని తెలియజేశారు హైపర్ ఆది. అందుకే అనసూయని ఎక్కువ స్కిట్ లలో చూపించడం జరిగింది అంటూ తెలిపారు. కొన్ని స్కిట్లను కూడా ముందుగా చెప్పేవాడినని తనకోసం కొన్ని డైలాగులు ప్రత్యేకంగా రాయించుకునేది అంటూ తెలిపారు హైపర్ ఆది.


హైపర్ ఆది అనసూయ చేసిన ఒక స్కిట్ కి 45 మిలియన్ల వ్యూస్ రావడంతో అప్పటినుంచి తమ కాంబినేషన్ బాగా వర్క్ అవుట్ అయిందని తెలిపారు.. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తను ఉద్యోగం చేస్తున్నప్పుడు తన తండ్రి చాలా అప్పులు చేశారని.. ఆ అప్పుడు తీర్చడానికే పొలాన్ని అమ్మేశామని.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి వచ్చి అంతకుమించి సంపాదించారని తెలిపారు హైపర్ ఆది.

మరింత సమాచారం తెలుసుకోండి: