తెలుగు లో స్టాండఫ్ కామెడీ షో గా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న షోలలో జబర్దస్త్ షో కూడా ఒకటి. వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ షో కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురు చూసేవారు. ఈ షోలో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ జబర్దస్త్ ని వదలకుండా చాలామంది కమెడియన్స్ ఇంకా ఇప్పటికి జబర్దస్త్ ప్లాట్ఫారం ని కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి వారిలో కమెడియన్ భాస్కర్ కూడా ఒకరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తాను ఎదురుకున్న కొన్ని ఇబ్బందులను తెలియజేశారు.


బుల్లెట్ భాస్కర్ ఎక్కువగా ఇతరుల పైన కాకుండా తన మీద ఎందుకు జోకులు వేసుకుంటారు అనే ప్రశ్న యాంకర్ అడగగా?.. అందుకు భాస్కర్ తన ఎదురుగా షారుఖ్ ఖాన్ కూర్చున్న కూడా తనను మిమిక్రీ చేయగలనని కానీ తెలుగులో అలాంటి పరిస్థితి ఉండదు సాధారణంగా ఒక హీరో సినిమా స్పూప్ చేసిన కూడా తమ హీరోని ఇమిటేట్ చేస్తావా అంటూ చాలామంది బెదిరిస్తారు..అలాంటివి తాను చాలా సార్లు భరించానని.. అలా ఒక హీరో అభిమానులు కూడా తనని బెదిరించారని.. అందుకే తాను ఏమి చేయలేక తన మీదే తానే జోకులు  వేసుకుంటానని తెలిపారు.


ఇక సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ గా ఉండాలని విషయంపై మాట్లాడుతూ సోషల్ మీడియాలోకి వెళ్లిన రోడ్డుపై బట్టలు విప్పి నడిచిన రెండు ఒకేలా ఉంటాయని.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాళ్లు ఉంటారు తాను ఏదైనా భరిస్తానని కానీ ఒకరితో చెప్పించుకోవడం, అనిపించుకోవడం అంటే తనకు అసలు ఇష్టం ఉండదని వెల్లడించారు. తనను కూడా చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకోమంటూ సలహా ఇచ్చారు కానీ తాను అయితే మాత్రం అలాంటి వాటి జోలికి వెళ్ళమని తెలిపారు.


సినిమా అవకాశాల గురించి మాట్లాడుతూ తనకి ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని ఒక చిత్రంలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం చాలా రోజులు డేట్స్ ఇచ్చిన కేవలం ఒక్క డైలాగు మాత్రమే ఉంచాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: