తెలుగులో జబర్దస్త్ షో గురించి చెప్పాల్సిన పని లేదు ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది వర్ష. గతంలో పలు రకాల సీరియల్స్ లలో నటించినప్పటికీ జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈమధ్య పలు షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది వర్ష. ఇటీవలే ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వర్ష తన గురించి సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ గురించి ప్రశ్నలు అడగగా తెలియజేసింది.



వాస్తవానికి జబర్దస్త్ వర్ష అంటేనే అందరికీ ఇమ్మాన్యుయేల్ గుర్తుకు వస్తారు.. అంతల వీరి జంట బుల్లితెరపై హిట్ అయింది. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని విధంగా వినిపించాయి. కానీ వర్ష మాత్రం ఇమ్మాన్యుయేల్ తనకు టీచర్ లాంటి వారు అని ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో చెప్పలేము దేవుడు తలరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని తెలిపింది.


ఇక ఎవరితో నటించాలనే కోరిక ఉందనే విషయంపై మాట్లాడుతూ తనకి అల్లు అర్జున్ తో నటించాలని కోరిక ఉందని.. అయితే ఆ రేంజ్ ఐకానిక్ స్టార్ తో నటించాలనుకోవడం కూడా అత్యాశే.. అల్లు అర్జున్ స్టైల్, డాన్స్ అంటే తనకు ఇష్టమని తన పక్కన చెల్లిగా ,అక్కగా  నటించమంటే చచ్చిన నటించను.. ఈ రెండు పాత్రలు తప్ప మరి ఎలాంటి పాత్ర అయినా సరే నటించేందుకు తాను సిద్ధమని తెలిపింది. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలో తాను చెల్లెలుగా నటించాలని ఉందని తెలిపింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉంది.. గత నాలుగేళ్లుగా ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి కానీ తాను వెళ్లడం లేదని.. కొంత బరువు పెరిగిన తర్వాతే అందులోకి వెళ్దాం అనుకున్నానని తెలిపింది వర్ష. తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకి అవకాశాలు వస్తున్నాయని కానీ తాను ఎక్కువగా గ్లామర్ రోల్స్ పాత్రలలోనే నటించాలని ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: