ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లో అతి తక్కువ ధరకు లభిస్తున్నాయి అంటే అవి xiaomi ఫోన్లు అనే చెప్పాలి. అతి తక్కువ ధరతో, ఎక్కువ స్పెసిఫికేషన్స్ వినియోగదారుల ముందుకు ఫోన్లు రిలీజ్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే redmi 9  స్మార్ట్ ఫోన్ అతి త్వరలోనే మార్కెట్లోకి రిలీజ్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ కి సర్టిఫికేషన్ కూడా లభించింది. తాజాగా యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ M2004J19G మోడల్ నెంబరు నా ఫోన్ కూడా చేయడం జరిగింది. ఇక ఈ సర్టిఫికేషన్ గల ఫోన్  REDMI 9 స్మార్ట్ ఫోన్ అని వార్తలు చెబుతున్నాయి. ఇక ఆన్లైన్లో కూడా లీక్ అయిన ఇది లిస్టింగ్ లో ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా ఉండటం గమనార్హం. దీని ప్రకారం ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత ఎమ్ఐ లెవెల్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేయబోతుంది అర్థమవుతుంది. ఈ ఫోన్ అతి త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 

 

ఇక ఫోన్ గలస్పెసిఫికేషన్స్ ఇలా 6.8 అంగుళాల స్క్రీన్ ను అందించనున్నారు. ఈ ఫోన్ MIUI 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది అని సంస్థ తెలియచేసింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి రాబతున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం కూడా  4920mah కెపాసిటీ తో ఉంది. దీనికి తోడు ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయని, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది అని అర్థం అవుతుంది. 

 

ఇది ఇలా ఉండగా ఈ ఫోన్ లాంచ్ విషయం గురించి ఇంతవరకు అధికారికంగా తెలియజేయలేదు. కానీ ఈ మోడల్ నెంబర్  చైనా 3సీ, రష్యా ఈఈసీ వెబ్ సైట్లలో వివరాలు ఉండడం జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్  అతి త్వరలోనే భారత్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: