ఇటీవలే వెలువడిన వీబో వెబ్సైటు లీక్ ప్రకారం షియోమి గౌగిన్, గాగిన్ ప్రో అనే కోడ్స్ పేర్లతో 2 మొబైల్ ఫోన్స్ తయారవుతున్నాయని తెలిసింది. గాగిన్ ప్రో మోడల్ 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో వస్తుందని బలంగా టాక్ వినిపిస్తోంది. బేస్ మోడల్‌లో మాత్రం 64 మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడిందని సమాచారం. రెడ్‌మి మొబైల్ సంస్థ గౌగిన్, గాగిన్ ప్రో స్మార్ట్‌ఫోన్‌లను 20 వేల రూపాయల లోపే లాంచ్ చేయనున్నట్లు జిఎస్‌మరేనా టెక్నాలజీ వెబ్సైటు పేర్కొంది. అయితే అధికారిక లాంచ్ డేట్ ఇంకా వెలువడలేదు. కానీ షియోమి గౌగిన్, గాగిన్ ప్రో మొబైల్ ఫోన్లు అతి త్వరలోనే భారతదేశంలో విడుదల కాబోతున్నాయని ప్రముఖ టెక్నాలజీ జర్నలిస్టులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని మొబైల్ కంపెనీ తయారీదారులు 108 మెగాపిక్సెల్ కెమెరాను తమ ప్రతి ప్రీమియం ఫోన్‌లో అమర్చుతున్నారు. షియోమి మి10 లో 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెట్ అప్ లభిస్తుందన్న సంగతి విదితమే. శ్యాంసంగ్ మొబైల్ ఫోన్లలో కూడా 108 మెగాపిక్సల్ కెమెరాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. 108 మెగాపిక్సెల్ కెమెరాలతో ఎస్ 20 అల్ట్రా, నోట్ 20 అల్ట్రా స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడుపోతున్నాయి. మోటరోలా మొబైల్ సంస్థ కూడా ఎడ్జ్ + స్మార్ట్ ఫోన్ ను 108 మెగాపిక్సెల్ సెన్సార్‌తో విడుదల చేసింది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం మొబైల్ ఫోన్లలో 108 మెగాపిక్సల్ కెమెరా ట్రెండ్ నడుస్తుందని తెలుస్తోంది. ఏదిఏమైనా అతి తక్కువ ధరకే 108 మెగాపిక్సల్ కెమెరాని స్మార్ట్‌ఫోన్‌లను షియోమి మొబైల్ సంస్థ విడుదల చేయడం విశేషం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి