ప్రస్తుతం డిజిటల్ వాచ్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది... ఫోన్ లో ఉన్న సదుపాయాలు వాచ్ లో ఉండటంతో చాలా మంది వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్ వాచ్ లకు ఎంతో గిరాకీ ఉంది.. అది ఆసరాగా చేసుకొని రియల్ మీ కంపెనీ కొత్త స్మార్ట్ వాచ్ లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇప్పుడు మరో స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది.. అయితే ఆన్ లైన్ లో వాచ్ ఫీచర్స్ లీక్ అవ్వడంతో క్రేజ్ అమాంతం పెరిగి పోయింది..


ఇక ఆలస్యం ఎందుకు ఆ వాచ్ కథ ఎంటో ఒకసారి చూసేద్దామా.. రియల్ మీ వాచ్ ఎస్ ప్రో మనదేశంలో త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ వెల్లడించారు. ఈ వాచ్ లు ఎప్పుడు లాంఛ్ అవుతాయో మాత్రం అధికారికంగా ప్రకటించిలేదు కానీ, త్వరలో రానున్నాయని వెల్లడించారు..రియల్ మీ వాచ్ ఎస్ ప్రో టీజర్‌ను షేర్ చేస్తూ.. కంపెనీ లాంచ్ చేయబోయే మొట్టమొదటి ప్రీమియం, హైఎండ్ స్మార్ట్ వాచ్ అని మాత్రం పేర్కొన్నారు..



గుండ్రటి డయల్, అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీనికి సంబంధించిన యూఎస్ ఎఫ్‌సీసీ లిస్టింగ్ సెప్టెంబర్‌లో లీకైంది. దీని ప్రకారం ఇందులో 1.39 అంగుళాల టచ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించనున్నారు. బ్యాటరీ సామర్థ్యం 420 ఎంఏహెచ్‌గా ఉంది. వీటితో పాటుగా ఆటోమేటిక్ యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్‌లను కూడా ఇందులో అందించారు. దీని ధరను రూ.7000 వేలు గా ప్రకటించారు.స్పోర్ట్స్ మోడ్స్, పీపీజీ సెన్సార్, రియల్ టైం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఇందులో ఉంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్‌కు ఎస్‌పీఓ2 లకు సంబంధించిన సెన్సార్ ను కూడా అందించారు. కేవలం ప్రకటన ద్వారా ఇంత క్రేజ్ తెచ్చిన ఈ వాచ్ లకు మార్కెట్ లో డిమాండ్ పెరిగింది.. మరి మార్కెట్ లో వస్తె భారీ సేల్ అవుతుందని కంపెనీ భావిస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: