కొత్త స్మార్ట్‌ ఫోన్లు కొనాలను కుంటున్నారా ? లేక మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తక్కువగా ఉందా ? ఇలాంటి వారికి గూగుల్‌ తల్లి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది.  ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఉన్న స్మార్ట్‌ మొబైల్‌ పై సంచలన నిర్ణయం తీసుకుంది గూగుల్‌ సంస్థ. పాత ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ వర్షన్‌ను ఉన్న మొబైళ్లకు గూగుల్‌ ఖాతాల్లోకి.. సైన్‌ ఇన్‌ కాకుండా ఉండేందుకే తన మద్దతును తొలగించుకోనుంది గూగుల్‌ సంస్థ. 

అంటే.... పాత ఆండ్రాయిడ్‌ వర్షన్‌ మొబైల్‌ ఫోన్లలో.. జీమెయిల్‌ మరియు యు-ట్యూబ్‌ అసలు ఓపెన్‌ కావన్న మాట. ఇక తాజా నిర్ణయాన్ని 2021 సంవత్సరం సెప్టెంబర్‌ 27 వ తేదీ నుంచి అమలులోకి తీసుకు రావాలని యోచిస్తోంది గూగుల్‌ సంస్థ.  ఇప్పటికే 2.3.7 కంటే తక్కువ వర్షన్‌ వాడుతున్న కస్టమర్లకు తాజా నిర్ణయానికి సంబంధించిన అలెర్టులను కూడా పంపించేసింది గూగుల్‌ సంస్థ.  2.3.7 కంటే తక్కువ వర్షన్‌ వాడుతున్న కస్టమర్లు.... ఇక నుంచి 3.0 ఆండ్రాయిడ్‌ హనీకోంబ్‌ వోఎస్‌కు చెందిన మొబైల్‌ పోన్లను వాడాలని సూచనలు చేసింది గూగుల్‌.  

ఒకవేళ 3.0 ఆండ్రాయిడ్‌ హనీకోంబ్‌ వోఎస్‌కు చెందిన మొబైల్‌ పోన్లను వాడనిచో...  జీమెయిల్‌ మరియు యు-ట్యూబ్‌ లాంటి గూగుల్‌ సంబంధించినవి ఎలాంటివి లాగిన్‌ కాలేరని స్పష్టం చేసింది గూగుల్‌. ఒకవేళ జీమెయిల్‌ మరియు యు-ట్యూబ్‌ లాంటి యాప్స్‌ లో లాగిన్‌ కావాలని ప్రయత్నాలు చేసినా.. ఫలితం ఉండబోదని పేర్కొంది గూగుల్‌. అలా లాగిన్‌ కావాలని చూస్తే... పాస్‌ వర్డ్‌ ఎర్రర్ అని చూపిస్తుందని వెల్లడించింది. యూజర్ల భద్రత మరియు డేటాను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ ప్రకటించిది. ఇక ఈ నిర్ణయాన్ని సెప్టెంబర్‌ 27 వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానుంది గూగుల్‌. గూగుల్‌ తాజా నిర్ణయంతో చాలా స్మార్ట్‌ ఫోన్స్‌ యూజర్లకు షాక్‌ తగలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: