వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే మెసేజీంగ్ యాప్ గా వాట్సాప్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ జెనరేషన్ లో  యువత కూడా వాట్సాప్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడే వాట్సాప్ ప్లే బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయడం జరిగింది.ఇక ఇది మునుపటి అప్‌డేట్‌లో భాగంగా ప్రవేశపెట్టిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ అధునాతన వాట్సాప్ బీటా వెర్షన్‌ని 2.21.17.1 వరకు వాట్సాప్ తీసుకువస్తుంది.WABetInfo నివేదిక ప్రకారం అయితే వాట్సాప్ ఇంతకుముందు ఒక అప్‌డేట్‌ను విడుదల చేయడం జరిగింది. ఇక అది యూజర్ లను వారి చాట్ ద్వారా స్క్రోల్ చేయడానికి అనుమతించని బగ్‌ను పరిచయం చేసింది. 

'Reddit' ఇంకా 'Twitter' వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది వినియోగదారులు ఈ బగ్‌ని నివేదించడం జరిగింది.వాట్సాప్ కొత్త అప్‌డేట్ సమస్యను పరిష్కరించడానికి దీన్ని ప్రవేశపెట్టింది.అలాగే స్క్రోలింగ్‌ను బాగా చూపించడానికి అప్‌డేట్ అనేది జరిగింది. ఆండ్రాయిడ్ , ఐఓస్ , వెబ్ కోసం వాట్సాప్ బీటా కోసం ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.అదనంగా, వాట్సాప్ ఇటీవల పరిమిత పబ్లిక్ బీటా పరీక్షను విడుదల చేయడం జరిగింది.ఇక ఇది ప్లాట్‌ఫారమ్‌కు ఒకేసారి రెండింట్లో పని చేసే సామర్థ్యాన్ని కూడా తెస్తుంది. ఇది యూజర్లు తమ ఫోన్‌లో సర్వీస్ ని అలాగే ఒకేసారి నాలుగు ఇతర నాన్-ఫోన్ పరికరాలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.ఇక వాట్సాప్ కంపెనీ ప్రకారం వారి  ఫోన్ బ్యాటరీ డెడ్ అయినప్పటికీ వినియోగదారులు ఇతర పరికరాల్లో తమ సందేశాలను చాలా ఈజీగా యాక్సెస్ చేయవచ్చు.అలాగే ఇతర డివైస్ లో కనెక్టివిటీని కొనసాగించడానికి ఫోన్ ఫస్ట్ డివైస్ గా ఉన్న ప్రస్తుత సెటప్ నుండి ఇది మార్పును తెలియజేస్తుంది.ఇక ఈ ఫీచర్ వినియోగదారులందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి.



https://twitter.com/wcathcart/status/1415386855793520640?s=19

మరింత సమాచారం తెలుసుకోండి: