అయితే, అమెరికాలోని లారెన్స్ లివర్‌మూర్ నేషనల్ లేబొరేటరీ (ఎల్ఎన్ ఆర్ ఎల్) గత నెలలో చేసిన ప్రయోగాల్లో ఇంతకముందు సృష్టించిన శక్తి కంటే ఎక్కువగా ఉత్పత్తి చేశారు. 192 లేజర్ కిరణాలను ఉపయోగించి కొన్ని మిల్లీమీటర్ల పరిమాణం ఉన్న ఇంధనాన్ని బాగా వేడెక్కించగా లేజర్ కిరణాల కోసం ఖర్చు పెట్టిన శక్తి కంటే 1.3 మెగాజౌళ్ల శక్తి అదనంగా ఉత్పత్తి అయింది. కిలో ముడిచమురు ద్వారా పుట్టే శక్తిలో ఇది మూడు శాతంగా ఉంది.
కేంద్రక సంలీన ప్రక్రియను సాధించేందుకు ప్రస్తుతం రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లో అనుసరించిన ఇనర్షియల్ కన్‌ఫైన్మెంట్ పద్ధతి, మరొకటి మాగ్నైట్ సాయంతో ప్లాస్మాను నియంత్రించేది. ఇనర్షియల్ కన్‌ఫైన్మెంట్‌లో శక్తిమంతమైన లేజర్లను సెకనులో వందకోట్ల వంతు ప్రయోగిస్తారు. ఇది సంలీన ప్రక్రియను ప్రారంభిస్తుంది. శక్తిమంతమైన లేజర్లు, ఇతర టెక్నాలజీలు అందుబాటులో లేనందునా ఇప్పటి వరకూ రెండో పద్ధతిపైనే ఎక్కువ ఆధారపడేవారు శాస్త్రవేత్తలు. ఎల్‌ఎన్‌ఆర్‌ఎల్‌లోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీలో 192 లేజర్ కిరణాలను గది మధ్యలో ఉంచిన మిలీమీటర్ల సైజున్న లోహంపై పడేలా చేస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి